నయన్‌తో స్నేహం కుదిరింది | Nayantara and Nicky galranis are often confronted with the introduction of friendship. | Sakshi
Sakshi News home page

నయన్‌తో స్నేహం కుదిరింది

Jul 18 2017 2:50 AM | Updated on Sep 5 2017 4:15 PM

నయన్‌తో స్నేహం కుదిరింది

నయన్‌తో స్నేహం కుదిరింది

ఒక్కోసారి అనుకోకుండా కొన్ని పనులు జరిగిపోతుంటాయి. అవి వారి జీవితంలో నూతనోత్సాహాన్ని కలిగిస్తాయి.

తమిళసినిమా: ఒక్కోసారి అనుకోకుండా కొన్ని పనులు జరిగిపోతుంటాయి. అవి వారి జీవితంలో నూతనోత్సాహాన్ని కలిగిస్తాయి. ఇప్పుడు ఇద్దరు బ్యూటీస్‌ అలాంటి ఆనందాన్నే అనుభవిస్తున్నారు. వనమగన్‌ చిత్రంతో కోలీవుడ్‌కు దిగుమతి అయిన బాలీవుడ్‌ ముద్దుగుమ్మ సాయేషాసైగల్‌. ఇక్కడ తొలి చిత్రంతోనే మంచి గుర్తింపును పొందిన సాయేషా అవకాశాలను బాగానే రాబట్టుకుంటోంది.

ప్రస్తుతం ప్రభుదేవా దర్శకత్వంలో విశాల్, కార్తీ కలిసి నటిస్తున్న కరుప్పురాజా వెళ్‌లైరాజా చిత్రంలో నటిస్తోంది. అంతకుముందే తెలుగులో అఖిల్‌ చిత్రం ద్వారా రంగప్రవేశం చేసింది. ఇలా దక్షిణాదిలో కేరీర్‌ ఆశాజనకంగా ఉండటంతో ఇక్కడే మకాం పెట్టాలన్న నిర్ణయానికి వచ్చిన సాయేషా హైదరాబాద్‌లో ఒక ఫ్లాట్‌ను అద్దెకు తీసుకుందట. ఇక్కడ విశేషం ఏమిటంటే అదే ఫ్లాట్‌లో ఇంతకుముందు నటి సమంత నివశించిందట. ఆ ఫ్లాట్‌లో ఉండగా సమంత యమ బిజీగా నటించిందట.

దీంతో తాను బిజీ హీరోయిన్‌ అయిపోతాననే కలలు కంటోందట నటి సాయేషాసైగల్‌. ఇక నటి నిక్కీగల్రాణి విషయానికి వస్తే కోలీవుడ్‌లో చేతి నిండా చిత్రాలతో బిజీగా ఉంది. ఈ అమ్మడు కూడా చెన్నైలో మకాం పెట్టేసింది. స్థానిక ఎగ్మోర్‌లోని ఒక అపార్ట్‌మెంట్‌లో ఒక ఫ్లాట్‌ను అద్దెకు తీసుకుంది. అదే అపార్ట్‌మెంట్‌లో నిక్కీగల్రాణి ఫ్లాట్‌కు పైన ఫ్లాట్‌లో అగ్రనటి నయనతార చాలా కాలంగా నివశిస్తోంది. ఒకే అపార్ట్‌మెంట్‌లో మకాం పెట్టడంతో నయనతార, నిక్కీగల్రాణిలు తరచూ ఎదురు పడటంతో ఆ పరిచయం వారిద్దరి మధ్య స్నేహాన్ని పెంచేసిందట. ఈ విషయాన్ని నటి నిక్కీగల్రాణి పట్టరాని ఆనందంతో తన ట్విట్టర్‌లో పోస్ట్‌ చేసేసింది. ఇలా యాదృచ్చికంగానే కొన్ని ఆనందభరిత సంఘటనలు జరుగుతాయన్న మాట.

Advertisement
 
Advertisement
Advertisement