నవాబ్‌ వస్తున్నాడు | nawab released on sept 27 | Sakshi
Sakshi News home page

నవాబ్‌ వస్తున్నాడు

Sep 22 2018 6:07 AM | Updated on Sep 22 2018 6:07 AM

nawab released on sept 27 - Sakshi

శింబు, విజయ్‌ సేతుపతి, అరవింద్‌ స్వామి, అరుణ్‌ విజయ్, జ్యోతిక, ఐశ్వర్యా రాజేష్, అదితీరావ్‌ హైదరి, జయసుధ, ప్రకాశ్‌రాజ్‌ ముఖ్య తారలుగా రూపొందిన మల్టీస్టారర్‌ ‘నవాబ్‌’. మణిరత్నం దర్శకత్వంలో రూపొందిన ఈ చిత్రం తెలుగు రిలీజ్‌ హక్కులను అశోక్‌ వల్లభనేని సొంతం చేసుకున్నారు. నాని ‘సెగ’, గౌతమ్‌మీనన్‌ ‘ఎర్ర గులాబీలు’ చిత్రాలను విడుదల చేయడంతో పాటు నాగశౌర్య ‘ఛలో’, రాజశేఖర్‌ ‘పీఎస్వీ గరుడవేగ’ వంటి చిత్రాలకు ఫైనాన్స్‌ చేశారు అశోక్‌. ‘నవాబ్‌’ గురించి అశోక్‌ మాట్లాడుతూ– ‘‘తమిళంలో ‘చెక్క చివంద వానం’ పేరుతో తెరకెక్కిన ఈ చిత్రాన్ని ‘నవాబ్‌’ పేరుతో ఈ నెల 27న తెలుగులో రిలీజ్‌ చేస్తున్నాం. యాక్షన్‌ డ్రామాగా తెరకెక్కిన చిత్రమిది. ఈ నెల 25న హైదరాబాద్‌లో జరగనున్న ఈ సినిమా ప్రీ–రిలీజ్‌ వేడుకలో మణిరత్నం, ఏఆర్‌ రెహమాన్‌ పాల్గొంటారు’’ అన్నారు.

Advertisement
 
Advertisement
Advertisement