గూఢచారి ట్రైలర్‌ విడుదల చేసిన నాని

Nani Released Adivi Sesh Goodachari Movie Trailer - Sakshi

అడివి శేష్ ఓ స్పై గా కనిపించనున్న గూఢచారి చిత్ర ట్రైలర్‌ను హీరో నాని శుక్రవారం విడుదల చేశారు. చిత్ర బృందంతో కలసి ట్రైలర్‌ లాంచ్‌ కార్యక్రమంలో పాల్గొన్న నాని వారితో సరదాగా గడిపారు. ప్రధాన పాత్రలన్నింటిని చూపిస్తూ సాగిన ట్రైలర్‌ సినిమాపై ఆసక్తిని మరింతంగా పెంచింది. ఈ చిత్రంలో యాక్షన్‌, ఎమోషన్స్‌తో పాటు లవ్‌ ట్రాక్‌ కూడా ఉన్నట్టు తెలుస్తోంది. ఇటీవలే విడుదలైన టీజర్‌ కూడా సినిమాపై అంచనాలను రెట్టింపు చేసింది. విభిన్న కథాశంతో తెరకెక్కుతున్న ఈ సినిమా కచ్చితంగా మంచి విజయం సాధిస్తుందని శేషు నమ్ముతున్నాడు. నాని కూడా ఈ ట్రైలర్‌ను లాంచ్‌ చేసినందుకు చాలా ఆనందంగా ఉందంటూ ట్విటర్‌లో తెలిపారు.

స్పై థ్రిల్లర్‌గా తెరెకెక్కుతున్న ఈ సినిమాకు శశికిరణ్‌ టీ దర్శకుడు. ఈ చిత్రంలో 2013లో మిస్ ఇండియా ఎర్త్ శోభితా ధూళిపాళ్ల హీరోయిన్‌ గా నటిస్తోంది. చాలా కాలం తరువాత  నాగార్జున మేనకోడలు సుప్రియ(అక్కడ అమ్మాయి.. ఇక్కడ అబ్బాయి చిత్ర హీరోయిన్‌) ఈ సినిమాతో రీఎంట్రీ ఇస్తున్నారు. ప్రముఖ నిర్మాణ సంస్థ అభిషేక్‌ పిక్చర్స్‌, పీపుల్స్‌ మీడియా ఫ్యాక్టరీ సంయుక్తంగా నిర్మిస్తున్న ఈ చిత్రం ఆగస్ట్‌ 3న రిలీజ్‌  కానుంది.

Advertisement
Advertisement

*మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది, *అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం, *ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరించబడతాయి, *వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి

Back to Top