ప్రతి సీన్‌ పసందుగా.. | nagakanya release date | Sakshi
Sakshi News home page

ప్రతి సీన్‌ పసందుగా..

Apr 3 2019 2:34 AM | Updated on Apr 3 2019 2:34 AM

nagakanya release date - Sakshi

లక్ష్మీరాయ్

వరలక్ష్మి, కేథరీన్, లక్ష్మీరాయ్, జై ముఖ్యపాత్రల్లో ఎల్‌. సురేష్‌ దర్శకత్వంలో తెరకెక్కిన చిత్రం ‘నాగకన్య’. జంబో సినిమాస్‌ బ్యానర్‌పై ఎ. శ్రీధర్‌ నిర్మించిన ఈ సినిమాని ఈ నెలలో విడుదల చేసేందుకు సన్నాహాలు చేస్తున్నారు. ఏ. శ్రీధర్‌ మాట్లాడుతూ– ‘‘విభిన్నమైన కాన్సెప్ట్‌తో తెరకెక్కిన చిత్రమిది. ఈ సినిమాలోని ప్రతి సన్నివేశం ఉత్కంఠ రేకెత్తిస్తుంది.

వరలక్ష్మి, కేథరీన్, లక్ష్మీరాయ్‌ పాత్రలు ఊహించని విధంగా ఉంటాయి.  ప్రతి క్యారెక్టర్‌కు మంచిపేరొచ్చేలా ఉంటుంది. వీరి ముగ్గురి లుక్స్‌కి మంచి స్పందన వస్తున్నందుకు చాలా సంతోషంగా ఉంది. ఈ చిత్రంలో జై క్యారెక్టర్‌ మరో హైలైట్‌గా నిలుస్తుంది. స్టోరీ, స్క్రీన్‌ప్లే ఉత్కంఠ రేకెత్తించే విధంగా ఉంటాయి. గ్రాఫిక్స్‌ అబ్బురపరుస్తాయి. ఇటీవలే విడుదలైన ట్రైలర్, ఆడియోకి మంచి స్పందన వచ్చింది. పిల్లలతో పాటు పెద్దలు మా సినిమా చూసి ఆనందిస్తారనే నమ్మకం ఉంది’’ అన్నారు.

Advertisement
 
Advertisement
Advertisement