సొంత బ్యానర్‌లో మరో సినిమా | Naga Shourya New Movie In His Own Banner | Sakshi
Sakshi News home page

Aug 21 2018 2:08 PM | Updated on Aug 21 2018 2:08 PM

Naga Shourya New Movie In His Own Banner - Sakshi

ఛలో సినిమాతో సూపర్‌ హిట్ కొట్టిన యంగ్‌ హీరో నాగశౌర్య ఫుల్‌ ఫాంలో ఉన్నాడు. ఛలో తరువాత అమ్మమ్మగారిల్లు లాంటి ఫ్లాప్‌ వచ్చినా అది నాగశౌర్య కెరీర్‌ మీద పెద్దగా ప్రభావం చూపించలేదు. ప్రస్తుతం డిఫరెంట్‌ కాన్సెప్ట్‌తో తెరకెక్కుతున్న నర్తనశాల సినిమాలోనటిస్తున్నాడు ఈ యంగ్‌ హీరో. ఈ సినిమా తరువాత భవ్య క్రియేషన్స్‌ బ్యానర్‌లో నారి నారి నడుమ మురారి సినిమా చేసేందుకు ఓకే చెప్పాడు.

ఆ తరువాత చేయబోయే సినిమాకు కూడా ఓకె చెప్పాడట ఈ యంగ్ హీరో. అంతేకాదు ఈ సినిమాను నాగశౌర్య మరోసారి తన సొంతం నిర్మాణ సంస్థ ఐరా క్రియేషన్స్‌ బ్యానర్‌పై నిర్మించనున్నాడు. శేఖర్‌ కమ్ముల దగ్గర దర్శకత్వ శాఖలో పనిచేసిన తేజ ఈసినిమాతో దర్శకుడిగా పరిచయం అవుతున్నాడు. ప్రస్తుతం చర్చల దశలో ఉన్న ఈసినిమాకు గణ అనే టైటిల్‌ను పరిశీలిస్తున్నారు. పూర్తి వివరాలు త్వరలో వెల్లడించనున్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement