'చే'తో శామ్‌.. చిందేసిన దగ్గుబాటి.. | Naga Chaitanya, Samantha marriage update | Sakshi
Sakshi News home page

'చే'తో శామ్‌.. చిందేసిన దగ్గుబాటి..

Oct 6 2017 4:38 PM | Updated on Jul 15 2019 9:21 PM

Naga Chaitanya, Samantha marriage update - Sakshi

పెళ్లికి ముస్తాబైన సమంత ఇన్‌స్టాగ్రామ్‌ ద్వారా చైతూ కలసి దిగిన సరికొత్త ఫొటోలను అభిమానులతో పంచుకున్నారు. పెళ్లి వేడుకలో దగ్గుబాటి సురేష్‌తో సమంత నృత్యం చేస్తున్న ఫొటోను నాగార్జున షేర్‌ చేశారు. గోవాలోని డబ్ల్యూ హోటల్ లో ఈ వేడుక జరుగుతోంది. ఈ రోజు రాత్రి 11 గంటల 52 నిమిషాలకు సమంత, నాగచైతన్య వివాహం జరగనుంది. అతి కొద్ది మంది సన్నిహితుల మధ్య ఈ కళ్యాణ మహోత్సవాన్ని ఘనంగా నిర్వహించనున్నారు. ఈ  వేడుకకు సింగర్‌, డబ్బింగ్‌ ఆర్టిస్ట్‌ చిన్మయి శ్రీపాద, ఆమె భర్త రాహుల్‌ రవీంద్రన్‌, వెన్నెల కిషోర్‌లు కూడా హాజరయ్యారు.

అభిమానులకు దూరంగా పెళ్లి వేడుక నిర్వహిస్తుండటంతో వారికోసం సోషల్ మీడియా లో ఫొటోలను పెడుతున్నారు నాగ్. ఉదయం నాగచైతన్యను పెళ్లి కొడుకును చేసిన సందర్భంలో తీసిన ఫొటోలను పోస్ట్ చేసిన కింగ్ మెహందీ వేడుకలో సమంతతో కలిసి దిగిన ఫొటోనే ట్వీట్ చేశాడు. మరి కొద్ది గంటల్లో నా కోడలు అంటూ కామెంట్ చేశారు.

1
1/8

2
2/8

3
3/8

4
4/8

5
5/8

6
6/8

7
7/8

8
8/8

Advertisement
 
Advertisement
Advertisement