ప్లాస్మా దానం చేసిన దియ.. ప్రశంసల జల్లు

Nafisa Ali Niece Second Covid 19 Warrior To Donate Plasma Karnataka - Sakshi

ప్లాస్మా దాత దియా నాయుడు నిజమైన హీరో: నటి నఫీసా

ఎంతో ధైర్యంగా పోరాడి ప్రాణాంతక కరోనా వైరస్‌ను జయించడంతో పాటు తన ప్లాస్మాను దానం చేసి అందరికీ ఆదర్శంగా నిలిచిందని తన కజిన్‌ కూతురు దియా నాయుడుపై నటి నఫీసా అలీ ప్రశంసలు కురిపించారు. కరోనాపై పోరులో విజయం సాధించి... ప్రస్తుతం తన లాంటి పేషెంట్లను కాపాడేందుకు సాయం అందిస్తున్న హీరో దియా అనుభవాలను తెలుసుకోవాలని తన ఇన్‌స్టా ఫాలోవర్లకు సూచించారు. ‘‘దియా నాయుడు. ప్లాస్మా దానం చేసి ఇంటికి తిరిగివచ్చింది. ఇప్పుడదే లిక్విడ్‌ గోల్డ్‌లా కనిపిస్తోంది. ఎన్నో ప్రాణాలను నిలబెడుతోంది కాబట్టి దానికి విలువ కట్టలేం’’అని తన సోషల్‌ మీడియా అకౌంట్లో రాసుకొచ్చారు. దియాను ధైర్యశాలిగా ఆమె అభివర్ణించారు. ఈ క్రమంలో ఆమెపై సోషల్‌ మీడియాలో ప్రశంసలు కురుస్తున్నాయి.(కరోనా: ‘ప్లాస్మా థెరపి’ అంటే ఏమిటీ?)

కాగా బెంగళూరులో నివసించే దియా నాయుడు కొరియోగ్రాఫర్‌గా గుర్తింపు పొందారు. కొన్ని రోజుల క్రితం కరోనా బారిన పడిన ఆమె ఇటీవలే కోలుకున్నారు. కరోనా పేషంట్లకు.. కోవిడ్‌ నుంచి కోలుకున్న వారి ప్లాస్మా ఎక్కించడం ద్వారా ప్రమాద తీవ్రత తగ్గుంతుందన్న వార్తల నేపథ్యంలో ముందుకొచ్చి.. కర్ణాటకలో ప్లాస్మా దానం చేసిన రెండో వ్యక్తిగా ఆమె నిలిచారు. ఈ క్రమంలో తన అనుభవాలు వెల్లడిస్తూ సోషల్‌ మీడియాలో సుదీర్ఘ పోస్ట్‌ షేర్‌ చేశారు. ‘‘కర్ణాటకలో ప్లాస్మా థెరపీ ప్రారంభించారు. కోవిడ్‌ నుంచి కోలుకున్న పేషెంట్ల రక్తంలోని ప్లాస్మాను సేకరిస్తున్నారు. అందులోని యాంటీబాడీలు వైరస్‌ బారిన పడిన వారు కోలుకునేందుకు ఉపయోగపడతాయి. ఒక్క బ్యాగు ప్లాస్మా ఒక పేషెంట్‌కు మాత్రమే సరిపోతుందట. అంటే ప్లాస్మా దానం చేయాల్సిన ఆవశ్యకత ఎంత ఉందో అర్థం చేసుకోవచ్చు.(ప్లాస్మా దానం చేస్తున్న తబ్లిగీలు)

కాబట్టి కరోనా నుంచి బయటపడ్డవారు ముందుకురావాలి. మనలాగే బాధ పడుతున్న వారిని కాపాడాలి. మీరు నాకు మెసేజ్‌ చేస్తే మీ సమాచారాన్ని డాక్టర్లకు చేరవేస్తాను. ఎవ్వరూ భయపడవద్దు. రక్తదానం చేసినట్లుగానే ఈ ప్రక్రియ కూడా. పెద్దగా నొప్పికూడా ఉండదు. అన్ని జాగ్రత్తలు తీసుకుంటూనే మన నుంచి ప్లాస్మా సేకరిస్తారు. నేను ఇప్పుడు బాగానే ఉన్నాను. అంతేకాదు మరో రెండు వారాల్లో తిరిగి ప్లాస్మా దానం చేసేందుకు సిద్ధంగా ఉన్నా. కేవలం నాలుగు గంటలు కేటాయిస్తే చాలు ఒక్కరి ప్రాణం కాపాడే అవకాశాలు మెండుగా ఉంటాయి. ఒక్కసారి ఆలోచించండి. వైద్యబృందాలు ఎంతో అద్భుతంగా పనిచేస్తున్నాయి. వారికి సాయం అందిద్దాం’’అని చైతన్యం నింపారు. కరోనా నుంచి కోలుకున్నవారు ప్లాస్మా దానం చేయాలని విజ్ఞప్తి చేశారు. 

My darling niece Diya Naidu - I am so grateful to you brave child - a COVID19 warrior ( living in Bangalore) has agreed to donate her plasma to help cure other COVID19 serious patients. The process of donating plasma to treat COVID-19 is not very complex and can be done in just two hours. One of the most discussed methods of treatment of the disease caused by the novel coronavirus is plasma therapy, which involves the transfusion of plasma from a convalescent coronavirus patient to a critical patient. The blood of a recovering patient is rich in antibodies produced by the body to fight the virus, which are expected to help the critical patient recover.#covid_19 #plasmadonation #india

A post shared by nafisa ali sodhi (@nafisaalisodhi) on

Read latest Movies News and Telugu News | Follow us on FaceBook, Twitter

మరిన్ని వార్తలు

12-08-2020
Aug 12, 2020, 18:19 IST
గడిచిన 24 గంటల్లో 57,148 నమూనాలు పరీక్షించగా 9,597 పాజిటివ్‌ కేసులు నమోదయ్యాయి. దీంతో మొత్తం పాజిటివ్‌ కేసుల సంఖ్య 2,54,146...
12-08-2020
Aug 12, 2020, 18:18 IST
సాక్షి, హైదరాబాద్‌: కరోనా బారిన పడిన దర్శక ధీరుడు యస్‌.యస్‌ రాజమౌళి.. ఆయన కుటుంబ సభ్యులకు నెగిటివ్‌ వచ్చింది ఇటీవల తనకు, తన కుటుంబ...
12-08-2020
Aug 12, 2020, 16:21 IST
వెల్లింగ్టన్‌: క‌రోనాను క‌ట్ట‌డి చేసిన దేశంగా న్యూజిలాండ్ పేరు మార్మోగిపోయింది. 102 రోజులుగా ఒక్క క‌రోనా కేసు లేక‌పోవ‌డంతో ఓర‌కంగా పండ‌గ...
12-08-2020
Aug 12, 2020, 12:12 IST
సాక్షి, హైద‌రాబాద్ :  క‌రోనాను జ‌యించి తిరిగి విధుల్లోకి చేరిన పోలీసుల‌ను రాచ‌కొండ సీపీ మ‌హేష్ భ‌గ‌వ‌త్ స‌న్మానం చేశారు....
12-08-2020
Aug 12, 2020, 11:32 IST
దాచేపల్లి : కరోనా మహమ్మారి అన్నదమ్ములను మింగేసింది. 20 రోజుల వ్యవధిలో కరోనాతో ఇద్దరూ మృత్యువాత పడిన విషాద ఘటన...
12-08-2020
Aug 12, 2020, 11:31 IST
వాషింగ్టన్ : కరోనా కట్టడికి వ్యాక్సిన్‌ను అందుబాటులోకి తెచ్చే క్రమంలో అమెరికా మరో కీలక ఒప్పందాన్ని కుదుర్చుకుంది. కరోనాకు కచ్చితమైన వ్యాక్సిన్ తమదేనని...
12-08-2020
Aug 12, 2020, 11:08 IST
ఓల్డ్‌ ఈజ్‌ గోల్డ్‌ అనే మాటను అక్షరాలా నిజం చేసుకుంటున్నారు ఈ తాతమ్మ, తాతయ్యలు. పాత దుస్తులను ధరించి మోడలింగ్‌ చేయడం...
12-08-2020
Aug 12, 2020, 10:57 IST
‘ఈ మహమ్మారి కాలంలో ప్రజలు వ్యాధి పట్ల అవగాహ కలిగి ఉండాలి. అప్పుడే వ్యాధి విస్తృతికి అడ్డుకట్ట వేయవచ్చు’ అని...
12-08-2020
Aug 12, 2020, 10:15 IST
సాక్షి, న్యూఢిల్లీ: ఇన్ఫోసిస్ వ్యవస్థాపకుడు నారాయణమూర్తి కరోనా మహమ్మారి, ఆర్థికసంక్షోభంపై సంచలన వ్యాఖ్యలు చేశారు. కరోనా వైరస్ మహమ్మారి నేపథ్యంలో దేశ...
12-08-2020
Aug 12, 2020, 09:56 IST
న్యూఢిల్లీ: భారత్‌లో కరోనా మహమ్మారి వ్యాప్తి కొనసాగుతూనే ఉంది. గడిచిన కొన్ని రోజులుగా పాజిటివ్‌ కేసుల సంఖ్యలో రికార్డు స్థాయిలో...
12-08-2020
Aug 12, 2020, 09:10 IST
వ్యాక్సిన్‌ వేసుకున్న తరువాత కరోనా వస్తే దాని తీవ్రత మరింత ఎక్కువగా ఉంటుందని పలువురు శాస్త్రవేత్తలు అనుమానం వ్యకం చేస్తున్నారు. ...
12-08-2020
Aug 12, 2020, 09:08 IST
సాక్షి, సిటీబ్యూరో: గతకొంత కాలంగా సిటీజన్లకుకంటిమీద కునుకు లేకుండా చేసిన కరోనా వైరస్‌క్రమంగా తగ్గుముఖం పడుతుండటంతో గ్రేటర్‌వాసులు ఊపిరి పీల్చుకుంటున్నారు....
12-08-2020
Aug 12, 2020, 09:05 IST
సాక్షి, హైదరాబాద్‌ :  రాష్ట్రంలో  కొత్తగా 1897 కరోనా పాజిటివ్‌ కేసులు నమోదయ్యాయి. ఈ మేరకు రాష్ట్ర వైద్యారోగ్యశాఖ బుధవారం ఉదయం హెల్త్‌...
12-08-2020
Aug 12, 2020, 08:40 IST
సాక్షి, సిటీబ్యూరో: ‘పెద్దల మాట..చద్దన్నం మూట’ అన్నారు. సామెత పాతదే కావచ్చు. కానీ ఇప్పుడుకోవిడ్‌ను ఎదుర్కోవడంలో ఇది ఒక ఆయుధంలాపనిచేస్తుంది....
12-08-2020
Aug 12, 2020, 08:29 IST
సాక్షి, సిటీబ్యూరో: ఎప్పుడైనా, ఎక్కడైనా ఏదైనా ప్రమాదం జరిగి ప్రాణ నష్టం జరిగితే సదరు ఘటనలు పునరావృతం కాకుండాతగు చర్యలు...
12-08-2020
Aug 12, 2020, 08:20 IST
న్యూఢిల్లీ : కోవిడ్‌–19 నిరోధక టీకాను దేశవ్యాప్తంగా పంపిణీ చేయడం ఎలా అన్న అంశంపై బుధవారం నిపుణుల కమిటీ భేటీ...
12-08-2020
Aug 12, 2020, 07:50 IST
గాంధీఆస్పత్రి : కోవిడ్‌ నోడల్‌ కేంద్రమైన సికింద్రాబాద్‌ గాంధీఆస్పత్రిలో బయోమెడికల్‌ (జీవ) వ్యర్థాలు రోజురోజుకూ గుట్టలుగా పేరుకుపోతున్నాయి. డంపింగ్‌యార్టుకు తరలించి...
12-08-2020
Aug 12, 2020, 06:26 IST
జీడిమెట్ల/చాదర్‌ఘాట్‌/కమ్మర్‌పల్లి: కరోనా భయంతో ముగ్గురు బలవన్మరణానికి పాల్పడ్డారు. కరోనాతో చిక్సిత పొందుతూ ఒకరు, కరోనా సోకిందేమోనన్న భయంతో మరొకరు, టీవీలో...
12-08-2020
Aug 12, 2020, 06:18 IST
సాక్షి, హైదరాబాద్‌: రాష్ట్రంలో కరోనా కేసుల సంఖ్య రోజురోజుకూ పెరుగుతూనే ఉంది. ఇప్పటివరకు 6,42,875 మందికి పరీక్షలు నిర్వహించగా.. 82,647...
12-08-2020
Aug 12, 2020, 04:49 IST
సాక్షి, అమరావతి: రాష్ట్రంలో కరోనా వైరస్‌ బారిన పడి కోలుకుంటున్న వారి శాతం గణనీయంగా పెరుగుతోంది. తాజా గణాంకాల ప్రకారం...
Advertisement

*మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది, *అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం, *ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరించబడతాయి, *వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి

Read also in:
Back to Top