ప్లాస్మా దానం చేస్తున్న తబ్లిగీలు | COVID-19 Recovered Tablighi Jamaat members offer plasma | Sakshi
Sakshi News home page

ప్లాస్మా దానం చేస్తున్న తబ్లిగీలు

Apr 28 2020 6:27 AM | Updated on Apr 28 2020 6:27 AM

COVID-19 Recovered Tablighi Jamaat members offer plasma - Sakshi

న్యూఢిల్లీ: ఢిల్లీలో తబ్లిగీ జమాత్‌లో పాల్గొని కరోనా సోకి, అనంతరం దాని నుంచి కోలుకున్న ముస్లిం సోదరులు కోవిడ్‌తో పోరాడుతున్న ఇతరులకు ప్లాస్మా దానం చేసేందుకు ముందుకు వచ్చారు. మార్చిలో జరిగిన తబ్లిగీ సదస్సు భారీ స్థాయిలో వ్యతిరేకతను మూటగట్టుకున్న సంగతి తెలిసిందే. తబ్లిగీలో పాల్గొన్న ముస్లింలు దేశద్రోహులంటూ సోషల్‌ మీడియాలో పోస్టులు కూడా వెలిశాయి. ఈ నేపథ్యంలో తబ్లిగీ కారణంగా కరోనా సోకి అనంతరం కోలుకున్న 300 మంది ముస్లింలు, ఇప్పటికీ కరోనాతో పోరాడుతున్న ఇతరులకు తమ ప్లాస్మాను దానం చేసేందుకు ముందుకు వచ్చారు. జమాత్‌ చీఫ్‌ మౌలానా సైతం ఈ దాన కార్యక్రమానికి కరోనా నుంచి కోలుకున్న ముస్లింలు ముందుకు రావాలంటూ రంజాన్‌ సందర్భంగా పిలుపునిచ్చారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement