సూర్య అంటే యాంగర్‌

Naa Peru Surya first look: Allu Arjun plays the role of young, angry soldier in this action film - Sakshi

బుల్లెట్‌ లాంటి కళ్లు. భయం లేని చూపులు. ఉక్కులాంటి బాడీ. పిడుగుల్లాంటి దెబ్బలు.. ఇవి చాలు శత్రువును జయించడానికి... కానీ సూర్య అనుకున్నది సాధించడానికి బలహీనత ఒకటి అడ్డు తగులుతుంది. అదే అతని ఆవేశం. ఆ ఆవేశం దేశం కోసమే. కానీ అదే ఆవేశం శత్రువుకు బలం. మరి... శత్రువు బలాన్ని సూర్య ఎలా ఢీ కొన్నాడు? అంటే.. స్క్రీన్‌ పైనే చూడాలి. అల్లు అర్జున్‌ హీరోగా వక్కంతం వంశీ దర్శకత్వంలో రూపొందుతున్న సినిమా ‘నా పేరు సూర్య.. నా ఇల్లు ఇండియా’. అనూ ఇమ్మాన్యుయేల్‌ కథానాయిక.

ఈ సినిమాలో  సైనికుడు సూర్య పాత్రలో అల్లు అర్జున్‌ కనిపించనున్నారు. కె. నాగబాబు సమర్పణలో రామలక్ష్మీ సినీ క్రియేషన్స్‌ పతాకంపై శిరీషా శ్రీధర్‌ నిర్మిస్తున్నారు. ‘బన్నీ’ వాసు సహ నిర్మాత. న్యూ ఇయర్‌ సందర్భంగా ఈ సినిమా ఫస్ట్‌ ఇంపాక్ట్‌ను రిలీజ్‌ చేశారు. ‘నీకు సూర్య సోల్జర్‌.. కానీ ప్రపంచానికి సూర్య అంటే యాంగర్‌’, ‘చచ్చిపోతాను.. కానీ ఇక్కడ కాదు బోర్డర్‌లో..’ అన్న డైలాగ్స్‌ సూపర్బ్‌గా ఉన్నాయని ఫ్యాన్స్‌ అంటున్నారు. చిత్ర సమర్పకుడు నాగబాబు మాట్లాడుతూ– ‘‘బన్నీ కెరీర్‌లో హై ఓల్టేజ్‌ యాక్షన్‌ ఎంటర్‌టైనర్‌ ఇది. వక్కంతం వంశీ కంప్లీట్‌ ప్యాకేజ్‌తో తెరకెక్కిస్తున్నారు.

దానికి ఉదాహరణే ఫస్ట్‌ ఇంపాక్ట్‌. హైదరాబాద్‌లో రెగ్యులర్‌ షూటింగ్‌ జరుగుతోంది’’ అన్నారు. ‘‘బన్నీగారి డెడికేషన్, వంశీ విజన్‌ ఏంటో ఫస్ట్‌ ఇంపాక్ట్‌లో తెలుస్తోంది. ముఖ్యంగా డైలాగ్స్‌ గురించి ప్రేక్షకులు మాట్లాడుకుంటుండడం ఆనందంగా ఉంది. ఏప్రిల్‌ 27న రిలీజ్‌ చేయాలనుకుంటున్నాం’’ అన్నారు శిరీషా శ్రీధర్‌. ‘‘న్యూ ఇయర్‌కు ఫస్ట్‌ ఇంపాక్ట్‌ను డబుల్‌ బొనాంజాగా ఫ్యాన్స్‌ భావిస్తున్నారు’’ అన్నారు ‘బన్నీ’ వాసు. ఈ సినిమాకు సంగీతం: విశాల్‌ –శేఖర్, ఎగ్జిక్యూటివ్‌ ప్రొడ్యూసర్‌: బాబు. ఈ రీల్‌లైఫ్‌ విషయాలు కాస్త పక్కనపెట్టి బన్నీ పర్సనల్‌ లైఫ్‌ దగ్గరకు వస్తే..న్యూ ఇయర్‌కు ఆయన సతీమణితో కలిసి ఎంజాయ్‌ చేసిన ఫొటోను సోషల్‌మీడియాలో పోస్ట్‌ చేశారు. ఇన్‌సెట్‌లో మీరు చూస్తున్న ఫొటో అదే.

Read latest Movies News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top