ఆ సీక్వెల్లో నటిస్తా! | music director ss.taman about sarainodu movie with alluarjun | Sakshi
Sakshi News home page

ఆ సీక్వెల్లో నటిస్తా!

Apr 17 2016 4:47 AM | Updated on Sep 3 2017 10:04 PM

ఆ సీక్వెల్లో నటిస్తా!

ఆ సీక్వెల్లో నటిస్తా!

స్టయిలిష్ స్టార్ అల్లు అర్జున్ స్టెప్స్‌కు, తమన్ రాకింగ్ మ్యూజిక్ తోడైతే ఎలా ఉంటుందో ‘రేసుగుర్రం’ చెప్పేసింది. మరోసారి వీళ్లిద్దరి కాంబినేషలో రానున్న చిత్రం ‘సరైనోడు’.

స్టయిలిష్ స్టార్ అల్లు అర్జున్ స్టెప్స్‌కు, తమన్ రాకింగ్ మ్యూజిక్ తోడైతే ఎలా ఉంటుందో ‘రేసుగుర్రం’ చెప్పేసింది. మరోసారి వీళ్లిద్దరి కాంబినేషలో రానున్న  చిత్రం ‘సరైనోడు’. గీతా ఆర్ట్స్ పతాకంపై అల్లు అర్జున్, రకుల్ ప్రీత్ సింగ్, కేథరిన్ థెరిస్సా ముఖ్య తారలుగా బోయపాటి శ్రీను దర్శకత్వంలో రూపొందిన ఈ చిత్రం ఈ నెల 22న విడుదల కానుంది. ఈ సందర్భంగా స్వరకర్త తమన్ మాట్లాడుతూ-‘‘ ‘భద్ర’ సమయం నుంచి బోయపాటి శ్రీనుగారితో పరిచయం ఉంది. ఆ సినిమాకు నేను కీబోర్డ్ ప్రోగ్రామర్‌గా చేశాను. ‘సరైనోడు’కి అడిగినప్పుడు బోయపాటి శ్రీనుగారికి తగ్గట్టుగా ట్యూన్స్ ఇవ్వగలనా అని ఆలోచించా.

కానీ సినిమా స్టార్ట్ అయిన కొన్నాళ్లకే మంచి స్నేహితులమైపోయాం. బాగా ఎంజాయ్ చేస్తూ ఈ సినిమా కోసం పనిచేశాను. బన్నీని అందరూ స్టయిలిష్ స్టార్ అంటూ ఉంటారు. అందుకే క్లాస్‌తో పాటు మాస్ ట్యూన్స్ కూడా ఉండేలా కేర్ తీసుకున్నా. నేనిప్పటివరకు బాణీలు స్వర పరిచిన సినిమాలన్నీ కమర్షియల్ ఎంటర్‌టైనర్లే. నాకు లవ్‌స్టోరీలు చేయాలని ఉంది. అందుకే వీలున్న చోట మెలోడీ పాటలు ట్రై చేస్తుంటా’’ అన్నారు. గతంలో ‘బాయ్స్’లో నటించారు కదా.. మళ్లీ నటించే ఉద్దేశం ఉందా? అనే ప్రశ్నకు - ‘‘అవకాశాలు వస్తున్నాయి కానీ, ఒప్పుకోలేదు. త్వరలో ‘బాయ్స్-2’ చేద్దామనుకుంటున్నాం. స్క్రిప్ట్ చాలా బాగుంది’’ అని చెప్పారు.

Advertisement
 
Advertisement
Advertisement