డబ్బు ముఖ్యం కాదు! | Money is not important says kajal agarwal | Sakshi
Sakshi News home page

డబ్బు ముఖ్యం కాదు!

Apr 22 2019 2:14 AM | Updated on Apr 22 2019 2:14 AM

Money is not important says kajal agarwal - Sakshi

కాజల్‌ అగర్వాల్‌

సౌత్‌లో జెట్‌స్పీడ్‌తో కెరీర్‌లో దూసుకెళ్తోన్న కథానాయిక కాజల్‌ అగర్వాల్‌ ఆ మ్యాజిక్‌ను నార్త్‌లో చూపించలేకపోయారు. 2004లో ‘క్యాం హో గయా నా..’ అనే హిందీ సినిమాతో యాక్టింగ్‌ కెరీర్‌ను స్టార్ట్‌ చేసిన కాజల్‌ ఆ తర్వాత రెండు హిందీ సినిమాలు (‘సింగమ్‌ (2011), స్పెషల్‌ 26 (2013)) చేశారు. బాలీవుడ్‌ సినిమాలను ఎందుకు తగ్గించారనే ప్రశ్న కాజల్‌ ముందు ఉంచితే... ‘‘సౌత్‌ ఇండియన్‌ ఆడియన్స్‌ నన్ను ఎంతగానో ఆదరిస్తున్నారు. సొంత మనిషిలా ఫీల్‌ అవుతున్నారు. నేను సౌత్‌ ఇండియన్‌ని కాదు. అయినా ఇక్కడ చాలా కంఫర్ట్‌గా ఉంది.

అందుకే సౌత్‌లో ఎక్కువగా సినిమాలు చేస్తున్నాను. బాలీవుడ్‌లో కమ్‌బ్యాక్‌ ఇవ్వాలనే ఆలోచన లేకపోలేదు. కొన్ని ఆఫర్లు వచ్చాయి. కాకపోతే రొటీన్‌ రోల్స్‌ కాకుండా కాస్త విభిన్నమైన, చాలెంజింగ్‌ రోల్స్‌ కోసం ఎదురుచూస్తున్నాను. సంజయ్‌లీలా భన్సాలీ, అయాన్‌ ముఖర్జీ వంటి దర్శకులతో కలిసి వర్క్‌ చేయాలని ఉంది. పాత్రల ఎంపికలో నేను డబ్బు గురించి ఆలోచించను. కథలో నా పాత్ర నచ్చినప్పుడు నా పారితోషికాన్ని కొన్ని సందర్భాల్లో తగ్గించుకున్నాను. డబ్బు కోసం మంచి పాత్రలను వదులుకోను. పాత్రల ఎంపికకే నా ప్రాధాన్యం.. డబ్బుకి కాదు’’ అని అన్నారు. పంజాబ్‌ నేపథ్యం ఉన్న కాజల్‌ కుటుంబం ప్రస్తుతం ముంబైలో సెటిలైన విషయం తెలిసిందే.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement