ఎన్టీఆర్కి మోహన్లాల్ సర్ప్రైజ్ గిఫ్ట్ | Mohanlals Surprising Gift to Jr NTR | Sakshi
Sakshi News home page

ఎన్టీఆర్కి మోహన్లాల్ సర్ప్రైజ్ గిఫ్ట్

Apr 15 2016 1:50 PM | Updated on Sep 3 2017 10:00 PM

ఎన్టీఆర్కి మోహన్లాల్ సర్ప్రైజ్ గిఫ్ట్

ఎన్టీఆర్కి మోహన్లాల్ సర్ప్రైజ్ గిఫ్ట్

మళయాల సూపర్ స్టార్ మోహన్ లాల్, టాలీవుడ్ యంగ్ హీరో ఎన్టీఆర్కు సర్ ప్రైజ్ గిఫ్ట్ ఇచ్చాడు. ప్రస్తుతం ఈ ఇద్దరు కొరటాల శివ దర్శకత్వంలో జనతా గ్యారేజ్ సినిమాలో నటిస్తున్నారు. అయితే ఏప్రిల్ 14న...

మళయాల సూపర్ స్టార్ మోహన్ లాల్, టాలీవుడ్ యంగ్ హీరో ఎన్టీఆర్కు సర్ ప్రైజ్ గిఫ్ట్ ఇచ్చాడు. ప్రస్తుతం ఈ ఇద్దరూ కొరటాల శివ దర్శకత్వంలో జనతా గ్యారేజ్ సినిమాలో నటిస్తున్నారు. అయితే ఏప్రిల్ 14న మళయాళీల నూతన సంవత్సరాది సందర్భంగా జూనియర్కు కానుకలందించాడు మోహన్ లాల్. కేరళలో మాత్రమే ప్రత్యేకంగా తయారయ్యే స్వీట్తో పాటు ఓ వెండి కృష్ణుడి విగ్రహాన్ని కూడా ఎన్టీఆర్కు బహుమతిగా ఇచ్చాడట.
 
శ్రీమంతుడు సినిమా తరువాత కొరటాల శివ తెరకెక్కిస్తున్న సినిమా కావటంతో జనతా గ్యారేజ్పై భారీ అంచనాలు ఏర్పాడ్డాయి. ఎన్టీఆర్ కూడా టెంపర్, నాన్నకు ప్రేమతో సినిమాలతో మంచి ఫాంలో ఉండటంతో ఈసారి భారీ హిట్ ఖాయం అన్న నమ్మకంతో ఉన్నారు చిత్రయూనిట్. ప్రస్తుతం మూడో షెడ్యూల్ షూటింగ్ జరుపుకుంటున్న ఈ సినిమాను ఆగస్టులో రిలీజ్ చేయడానికి ప్లాన్ చేస్తున్నారు.

Advertisement
Advertisement
 
Advertisement
Advertisement