ఒక్క ఏడాదిలో ఐదు సినిమాలు | Mohanlal 5th release in 2016 | Sakshi
Sakshi News home page

ఒక్క ఏడాదిలో ఐదు సినిమాలు

Dec 10 2016 12:31 PM | Updated on Sep 4 2017 10:23 PM

ఒక్క ఏడాదిలో ఐదు సినిమాలు

ఒక్క ఏడాదిలో ఐదు సినిమాలు

ఈ జనరేషన్ హీరోలందరూ ఆచితూచి అడుగులు వేస్తున్నారు. ఒక సినిమా సెట్స్ మీద ఉండగా మరో సినిమా గురించి ఆలోచన కూడా చేయటం లేదు

ఈ జనరేషన్ హీరోలందరూ ఆచితూచి అడుగులు వేస్తున్నారు. ఒక సినిమా సెట్స్ మీద ఉండగా మరో సినిమా గురించి ఆలోచన కూడా చేయటం లేదు. అందుకే ఏడాది ఒకటి రెండు సినిమాలు రిలీజ్ చేయటమే కష్టంగా మారింది. యంగ్ హీరోలు కూడా ఇదే ఫార్ములా ఫాలో అవుతుంటే, ఓ సీనియర్ హీరో, అది కూడా సూపర్ స్టార్ ఇమేజ్ ఉన్న టాప్ హీరో మాత్రం ఈ ఏడాది తన నాలుగో సినిమాను రిలీజ్ చేయడానికి రెడీ అవుతున్నాడు.

ఈ ఏడాది తెలుగులో మనమంతా, జనతా గ్యారేజ్ సినిమాలతో ప్రేక్షకుల ముందుకు వచ్చిన మోహన్ లాల్, మళయాలంలోనూ రెండు సినిమాలను రిలీజ్ చేశాడు. మోహన్ లాల్ ప్రధాన పాత్రలో తెరకెక్కిన పులిమురుగన్, ఒప్పం సినిమాలు రికార్డ్ కలెక్షన్లతో మళయాల సినిమా స్థాయిని పెంచాయి. ఇప్పటికే నాలుగు సినిమాలను రిలీజ్ చేసిన ఈ కంప్లీట్ యాక్టర్ త్వరలో మరో సినిమాను రిలీజ్ చేసేందుకు రెడీ అవుతున్నాడు.

ఈ నెల 22న 'ముంతిరివల్లికల్ తలిరిక్కుంబోల్' సినిమాను రిలీజ్ చేస్తున్నాడు. మై వైఫ్ ఈజ్ మై లైఫ్ అనే ట్యాగ్ లైన్తో తెరకెక్కుతున్న ఈ సినిమాలో మోహన్ లాల్ సరసన మీనా హీరోయిన్గా నటిస్తోంది. గతంలో ఇదే కాంబినేషన్లో వచ్చిన దృశ్యం ఘనవిజయం సాధించటంతో ఈ సినిమాపై కూడా భారీ అంచనాలు ఏర్పడ్డాయి. ఫ్యామిలీ డ్రామాగా తెరకెక్కుతున్న ముంతిరివల్లికల్ తలిరిక్కుంబోల్తో మోహన్ లాల్  మరో హిట్ సాధిస్తాడేమో చూడాలి.

Advertisement
 
Advertisement
Advertisement