
ఫిల్మ్ ఇండస్ట్రీ ఎవడబ్బ సొత్తు కాదు..
ప్రొడ్యూసర్స్ సిండికేట్ మీద సీనియర్ నటుడు మోహన్ బాబు తీవ్ర స్థాయిలో ధ్వజమెత్తారు. తెలుగు చిత్ర పరిశ్రమ ఎవడబ్బ సొత్తు కాదని, ఫైనాన్షియర్లను మోసం చేసేవాడు లఫూట్ అంటూ ఆయన మండిపడ్డారు.
హైదరాబాద్: ప్రొడ్యూసర్స్ సిండికేట్ మీద సీనియర్ నటుడు మోహన్ బాబు తీవ్ర స్థాయిలో ధ్వజమెత్తారు. తెలుగు చిత్ర పరిశ్రమ ఎవడబ్బ సొత్తు కాదని, ఫైనాన్షియర్లను మోసం చేసేవాడు లఫూట్ అంటూ ఆయన మండిపడ్డారు. ప్రొడ్యూసర్స్ సిండికేట్ మీద త్వరలో ప్రెస్మీట్ పెడతామని మోహన్ బాబు శనివారమిక్కడ అన్నారు. చిన్న నిర్మాతలకు ఎప్పుడూ అండగా ఉంటానని, కొందరు పెద్ద నిర్మాతలు ...చిత్ర పరిశ్రమను భ్రష్టు పట్టిస్తున్నారని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. ఇదే విషయంలో నిర్మాత, దర్శకుడు తమ్మారెడ్డి భరద్వాజ కూడా విరుచుకుపడ్డారు.
అసోసియేటెడ్ ప్రొడ్యూసర్స్ ఆఫ్ తెలుగు ఎల్ఎల్పీ పేరుతో ప్రత్యేక కమిటీని ఏర్పాటు చేసుకుని సిండికేట్గా ఏర్పడిన 11 మంది సినీ నిర్మాతలపై విమర్శలు వెల్లువెత్తుతున్న విషయం తెలిసిందే.