breaking news
producers syndicate
-
మీటూకు ప్రొడ్యూసర్స్ గిల్డ్ మద్దతు
ముంబై : దేశవ్యాప్తంగా ప్రకంపనలు సృష్టిస్తోన్న మీటూ ఉద్యమానికి భారత నిర్మాతల సమాఖ్య (ప్రొడ్యూసర్స్ గిల్డ్ ఆఫ్ ఇండియా) మద్దతు పలికింది. బాలీవుడ్ దిగ్గజాలు సాజిద్ ఖాన్, సుభాష్ ఘాయ్, రజత్ కపూర్, వికాస్ బహల్ సహా పలువురు ప్రముఖుల పేర్లు వెలుగులోకి రావడం పెను దుమారం రేపింది. మీటూ పేరుతో భిన్న రంగాలకు చెందిన మహిళలు తమకెదురైన అనుభవాలను బాహాటంగా వెల్లడిస్తున్న క్రమంలో ఈ ఉద్యమానికి మద్దతుగా ప్రొడ్యూసర్స్ గిల్డ్ ఆఫ్ ఇండియా బుధవారం ఓ అధికారిక ప్రకటన జారీ చేసింది. మహిళలకు పనిప్రదేశాల్లో లైంగిక వేధింపులు ఎదురైతే తగిన చట్టాలను అమలు చేస్తామని సభ్యులంతా తప్పనిసరిగా డిక్లరేషన్‌పై సంతకం చేయాలని స్పష్టం చేసింది. డిక్లరేషన్ సమర్పించని సభ్యుడిని 30 రోజుల అనంతరం సమాఖ్య నుంచి బహిష్కరిస్తామని హెచ్చరించింది. లైంగిక వేధింపులకు పాల్పడ్డారని నిరూపించబడిన వారిపై కఠిన చర్యలు చేపడతామని హామీ ఇచ్చింది. పనిప్రదేశంలో మహిళల భద్రత కోసం నైపుణ్యం కలిగిన ఇతర ఏజెన్సీలతో వర్క్‌షాపులు నిర్వహిస్తామని ప్రొడ్యూసర్స్ గిల్డ్ పేర్కొంది. -
'ఫిల్మ్ ఇండస్ట్రీ ఎవడబ్బ సొత్తు కాదు..'
-
ఫిల్మ్ ఇండస్ట్రీ ఎవడబ్బ సొత్తు కాదు..
హైదరాబాద్: ప్రొడ్యూసర్స్ సిండికేట్ మీద సీనియర్ నటుడు మోహన్ బాబు తీవ్ర స్థాయిలో ధ్వజమెత్తారు. తెలుగు చిత్ర పరిశ్రమ ఎవడబ్బ సొత్తు కాదని, ఫైనాన్షియర్లను మోసం చేసేవాడు లఫూట్ అంటూ ఆయన మండిపడ్డారు. ప్రొడ్యూసర్స్ సిండికేట్ మీద త్వరలో ప్రెస్‌మీట్ పెడతామని మోహన్ బాబు శనివారమిక్కడ అన్నారు. చిన్న నిర్మాతలకు ఎప్పుడూ అండగా ఉంటానని, కొందరు పెద్ద నిర్మాతలు ...చిత్ర పరిశ్రమను భ్రష్టు పట్టిస్తున్నారని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. ఇదే విషయంలో నిర్మాత, దర్శకుడు తమ్మారెడ్డి భరద్వాజ కూడా విరుచుకుపడ్డారు. అసోసియేటెడ్ ప్రొడ్యూసర్స్ ఆఫ్ తెలుగు ఎల్ఎల్పీ పేరుతో ప్రత్యేక కమిటీని ఏర్పాటు చేసుకుని సిండికేట్‌గా ఏర్పడిన 11 మంది సినీ నిర్మాతలపై విమర్శలు వెల్లువెత్తుతున్న విషయం తెలిసిందే.