చివరి చూపు చూడలేదు | Mithun chakraborty bereaved by his father basantkumar | Sakshi
Sakshi News home page

చివరి చూపు చూడలేదు

Apr 25 2020 4:34 AM | Updated on Apr 25 2020 4:34 AM

Mithun chakraborty bereaved by his father basantkumar - Sakshi

మిథున్‌ చక్రవర్తి

బాలీవుడ్‌ నటుడు మిథున్‌ చక్రవర్తి ఇంట్లో విషాదం చోటు చేసుకుంది. ఆయన తండ్రి బసంత్‌ కుమార్‌ చక్రవర్తి (95) ఇటీవలే మరణించారు. కొంత కాలంగా అనారోగ్యంతో బాధపడుతున్న ఆయన ముంబైలోని ఓ ఆసుపత్రిలో చికిత్స పొందుతూ మరణించారు. ఈ విషయాన్ని ఆయన మనవడు, మిథున్‌ చక్రవర్తి కుమారుడు నిమిష్‌ చక్రవర్తి తెలిపారు. లాక్‌డౌన్‌ ముందు ఓ సినిమా షూటింగ్‌ నిమిత్తం బెంగళూర్‌ వెళ్లిన మిథున్‌ చక్రవర్తి లాక్‌డౌన్‌ కావడంతో అక్కడే ఉండిపోవాల్సి వచ్చింది. దీంతో తండ్రిని చివరిసారిగా చూసే అవకాశం దక్కలేదట. 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement