ఫిబ్రవరి 22న ‘మిఠాయి’ | Mithai to release on February 22nd | Sakshi
Sakshi News home page

Jan 22 2019 3:11 PM | Updated on Jan 22 2019 3:11 PM

Mithai to release on February 22nd - Sakshi

రాహుల్ రామకృష్ణ, ప్రియదర్శి కథానాయకులుగా ప్రశాంత్ కుమార్ దర్శకత్వంలో తెరకెక్కిన డార్క్ కామెడీ చిత్రం ‘మిఠాయి’. ఈ సినిమాకు డాక్టర్ ప్రభాత్ కుమార్ నిర్మాత. ఫిబ్రవరి 22 న విడుదలకు రెడీ అవుతున్న ఈ మూవీ ప్రమోషన్‌ కార్యక్రమాల్లో భాగంగా మంగళవారం చిత్ర టీజర్‌ను విడుదల చేశారు.

ఈ సందర్భంగా నిర్మాత ప్రభాత్ కుమార్ మాట్లాడుతూ ‘ఇద్దరు స్నేహితుల నేపథ్యంలో నడిచే చిత్రమిది. ప్రేక్షకులను కడుపుబ్బా నవ్విస్తుంది. ఇప్పటికే విడుదలైన ప్రచార చిత్రాలు, పాటలకు విశేష స్పందన లభిస్తోంది. సాయిగా రాహుల్ రామకృష్ణ బాగా నటించారు. ఫిబ్రవరి 22న ప్రపంచ వ్యాప్తంగా చిత్రాన్ని విడుదల చేయాలనుకుంటున్నాం’ అని అన్నారు.

Advertisement
 
Advertisement
Advertisement