నవ్వించి పంపించే బాధ్యత మాది | Mithai Movie Audio Launch | Sakshi
Sakshi News home page

నవ్వించి పంపించే బాధ్యత మాది

Feb 17 2019 3:04 AM | Updated on Jul 12 2019 4:40 PM

Mithai Movie Audio Launch - Sakshi

కమల్‌ కామరాజ్, ప్రశాంత్, వివేక్‌ సాగర్, తరుణ్‌ భాస్కర్, ప్రియదర్శి

రాహుల్‌ రామకృష్ణ, ప్రియదర్శి కథానాయకలుగా నటించిన సినిమా ‘మిఠాయి’. ప్రశాంత్‌ కుమార్‌ దర్శకుడిగా పరిచయం కానున్నారు. ప్రభాత్‌ కుమార్‌ నిర్మించారు. వివేక్‌ సాగర్‌ సంగీతం అందించారు. ఈ నెల 22న విడుదల కానున్న ఈ సినిమా పాటల విడుదల వేడుక హైదరాబాద్‌లో జరిగింది. దర్శకుడు తరుణŠ æభాస్కర్‌ బిగ్‌ సిడీని ఆవిష్కరించి ‘హుషార్‌’ ఫేమ్‌ దర్శకుడు శ్రీహర్ష కొనుగంటికి అందించారు. అనంతరం తరుణ్‌ భాస్కర్‌ మాట్లాడుతూ– ‘‘రాహుల్‌ రామకృష్ణ, ప్రియదర్శి నా స్నేహితులు.

మేమందరం కలిసి సైన్మా (షార్ట్‌ ఫిల్మ్‌), ‘పెళ్ళిచూపులు’ చేశాం. మమ్మల్ని ప్రేక్షకులు ఆదరిస్తారని, ఇంత సక్సెస్‌ అవుతామని ఎప్పుడూ అనుకోలేదు. అందరూ అనుకున్నట్లు నేను ఇంకా యాక్టర్‌ అవ్వలేదు. డైరెక్షన్‌ చేస్తున్నా. కాకపోతే.. అనుకోకుండా రోల్స్‌ రావడంతో యాక్ట్‌ చేస్తున్నాను’’ అన్నారు. ‘‘నా కథపై నమ్మకంతో సినిమాకు వర్క్‌ చేసిన ప్రతి ఒక్కరికీ ధన్యవాదాలు. సినిమాను నిర్మించిన ప్రభాత్‌ కుమార్‌కి థ్యాంక్స్‌’’ అన్నారు ప్రశాంత్‌ కుమార్‌. ‘‘నేను ఓ డాక్టర్‌ని.

నన్ను నిర్మాతను చేసింది ప్రశాంతే. తను ఏడాదిన్నరపాటు సినిమా కోసం ఎంతో కష్టపడ్డాడు’’ అన్నారు ప్రభాత్‌. ‘‘ప్రశాంత్‌కు తెలుగు రాదు. కానీ తెలుగు సినిమాలంటే చాలా ఇష్టం. స్క్రిప్ట్‌ విన్నప్పుడు నాకు చాలా భయాలు ఉండేవి. రాహుల్‌ రామకృష్ణ సినిమాలోకి వచ్చిన తర్వాత అంతా సెట్‌ అయ్యింది. ప్రేక్షకులను కడుపుబ్బా నవ్వించి పంపే బాధ్యత మాది. ఒక్క అవకాశం ఇవ్వండి.. నవ్విస్తాం’’ అన్నారు ప్రియదర్శి. సంగీతదర్శకుడు వివేక్‌ సాగర్‌ పాల్గొన్నారు.

Advertisement
 
Advertisement
Advertisement