మిస్‌ మ్యాచ్‌ హిట్‌ అవుతుంది

Mismatch Song Launch by Pawan Kalyan - Sakshi

ఉదయ్‌ శంకర్, ఐశ్వర్యా రాజేష్‌ జంటగా ఎన్‌వి. నిర్మల్‌ కుమార్‌ దర్శకత్వంలో తెరకెక్కిన చిత్రం ‘మిస్‌ మ్యాచ్‌’. అధిరోహ్‌ క్రియేటివ్‌ సైన్స్‌ ఎల్‌.ఎల్‌.పి పతాకంపై జి.శ్రీరామ్‌ రాజు, భరత్‌ రామ్‌ నిర్మించిన ఈ సినిమా ఈ నెల 6న విడుదలకానుంది. ఈ చిత్రంలోని ‘ఈ మనసే...’ గీతాన్ని పవన్‌ కళ్యాణ్‌ విడుదల చేసి, మాట్లాడుతూ– ‘‘మిస్‌ మ్యాచ్‌’ సినిమా విజయం సాధిస్తుందనే నమ్మకం ఉంది. ఉదయ్‌ శంకర్‌కు శుభాకాంక్షలు.. చిత్ర యూనిట్‌కు అభినందనలు’’ అన్నారు.

‘‘నా అభిమాన నటుడు పవన్‌ కళ్యాణ్‌గారు నటించిన ‘తొలిప్రేమ’ చిత్రంలోని ‘ఈ మనసే..’ పాటను ‘మిస్‌ మ్యాచ్‌’ లో నాపై చిత్రీకరించటం, దాన్ని ఆయన విడుదల చేయడం సంతోషంగా ఉంది’’ అన్నారు ఉదయ్‌ శంకర్‌. ‘‘ప్రేక్షకులు కోరుకున్న అన్ని అంశాలు మా సినిమాలో ఉంటాయి. సినిమా బాగా వచ్చింది.. ఎన్‌.వి.నిర్మల్‌ బాగా తీశారు. ఉదయ్‌ శంకర్, ఐశ్వర్య రాజేష్‌ చక్కగా నటించారు’’ అన్నారు శ్రీరామ్‌. ‘‘ఈ సినిమాలో అన్ని పాటలు బాగా వచ్చాయి.. శ్రోతలకు నచ్చుతాయి’’ అన్నారు సంగీత దర్శకుడు గిఫ్టన్‌. ఈ చిత్రానికి కెమెరా: గణేష్‌ చంద్ర.

Read latest Movies News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram 

Read also in:
Back to Top