2,650 వెబ్ సైట్లపై బ్యాన్ | Mersal Effect Ban on 2650 web sites | Sakshi
Sakshi News home page

2,650 వెబ్ సైట్లపై బ్యాన్

Oct 15 2017 3:11 PM | Updated on Oct 15 2017 3:20 PM

Vijay Mersal

కోలీవుడ్ టాప్ హీరో విజయ్ హీరోగా తెరకెక్కుతున్న తాజా చిత్రం మెర్సల్. భారీ బడ్జెట్ తో అట్లీ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ సినిమా దీపావళి కానుగా ఈ నెల 18న రిలీజ్ అవుతోంది. విజయ్ ఇమేజ్ కు తోడు గత రెండు వారాలుగా కోలీవుడ్ లో ఒక్క సినిమా కూడా రిలీజ్ కాకపోవటంతో మెర్సల్ రిలీజ్ కోసం అభిమానులు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.

అయితే అదే సమయంలో కొంత మంది వెబ్ సైట్ నిర్వాహకులు మెర్సల్ సినిమాను వీలైనంత త్వరగా పైరసీ చేసేందుకు సిద్ధమయ్యారు. అయితే హైకోర్ట్ తీర్పు చిత్రయూనిట్ కు ఊరటనిచ్చింది. దేశ వ్యాప్తంగా పైరసీకి పాల్పడుతున్న 2650 వెబ్ సైట్స్ ను బ్లాక్ చేయాల్సిందిగా 37 ఇంటర్ నెట్ సర్వీస్ లను హై కోర్ట్ ఆదేశించింది. విజయ్ త్రిపాత్రాభినయం చేస్తున్న ఈ సినిమాలో సమంత, కాజల్, నిత్యామీనన్ లు హీరోయిన్లు గా నటిస్తున్నారు. ఈ సినిమాను తెలుగులో అదిరింది పేరుతో రిలీజ్ చేస్తున్నారు.

Advertisement
 
Advertisement
Advertisement