ఆ హీరోతో అంతా ఓకే.. కానీ! | Megha Akash speaks about actor Dhanush | Sakshi
Sakshi News home page

ఆ హీరోతో అంతా ఓకే.. కానీ!

Jan 9 2018 7:08 PM | Updated on Jan 9 2018 7:31 PM

Megha Akash speaks about actor Dhanush - Sakshi

సాక్షి, సినిమా: నటుడు ధనుష్‌లో అన్నీ నచ్చాయ్‌ అంటోంది నటి మేఘా ఆకాశ్‌‌. అయితే ఆ హీరోలో ఓ లోటు కనిపించిందని పలు విషయాలు షేర్‌ చేసుకుంది. ఈ చెన్నై చిన్నది తెలుగులో ‘లై’  అంటూ నితిన్‌తో జత కట్టింది. ఇక తమిళంలో ’ఒరు పక్క కథ’ తో పరిచయం అవుతోంది. ఈ మూవీ విడుదలకు ముందే స్టార్‌ నటుడు ధనుష్‌తో రొమాన్స్‌ చేసే ఛాన్స్‌ కొట్టేసింది. ఈ జంట నటిస్తున్న ఎన్నైనోకి పాయుమ్‌ తోట్టా చిత్రం నిర్మాణంలో ఉంది. వైవిధ్యభరిత కథా చిత్రాల దర్శకుడు గౌతమ్‌ మీనన్‌ ఈ చిత్రాన్ని తెరకెక్కిస్తున్న విషయం తెలిసిందే.

ఈ చిత్రం గురించి నటి మేఘా ఆకాశ్‌ మాట్లాడుతూ.. కెరీర్‌ ఆరంభంలోనే ధనుష్‌ వంటి ప్రముఖ నటుడితో నటించే అవకాశం రావడం అదృష్టంగా భావిస్తున్నట్లు పేర్కొంది. ఈ చిత్రం నా కెరీర్‌కు చాలా ముఖ్యమైనది. పాత్ర గురించి ఇప్పుడే ఏమీ చెప్పలేనని, అయితే నటనకు అవకాశం ఉన్న పాత్ర అంటోంది. నటుడు ధనుష్‌లో మీకు నచ్చిన విషయం ఏమిటన్న ప్రశ్నకు ఆయనలో నచ్చని అంశమే అంటూ ఉండదని చెబుతోంది. ధనుష్‌ గొప్ప నటుడని, షూటింగ్‌ స్పాట్‌లో తనకుంటే చాలా శాంతంగా ఉంటారని, అదే ఆయనలో లోటు అని అభిప్రాయపడింది.

ఇక గౌతమ్‌మీనన్‌ దర్శకత్వంలో నటించడం నాకు ఒక స్కూల్‌ లైఫ్‌ లాంటిది. ఈ చిత్రం ద్వారా చాలా విషయాలు నేర్చుకుంటున్నాను. అయితే ఎన్నై నోక్కి పాయుమ్‌ తోట్టా చిత్రం మాత్రం చాలా కాలం నుంచి నిర్మాణం జరుపుకుంటోంది. ఎప్పుడు పూర్తవుతుందో, ఎప్పుడు విడుదలవుతుందో తెలియని పరిస్థితి.  కాగా, ఒరు పక్క కథ మాత్రం నిర్మాణ కార్యక్రమాలు పూర్తి చేసుకుని త్వరలో విడుదలకు ముస్తాబవుతోంది.

Advertisement
 
Advertisement
Advertisement