కుదిరింది... కప్పు కాఫీ! | Mega pic of the year! Ram Charan shares priceless pic with his dad | Sakshi
Sakshi News home page

కుదిరింది... కప్పు కాఫీ!

Nov 24 2017 12:11 AM | Updated on Nov 24 2017 12:11 AM

Mega pic of the year! Ram Charan shares priceless pic with his dad - Sakshi

తండ్రిలానే కొడుకు కూడా. అవును.. తండ్రి చిరంజీవిలా కొడుకు రామ్‌చరణ్‌ కూడా గెడ్డం పెంచారు. డాడ్‌ ఏమో ‘సైరా’ కోసం సన్‌ ఏమో ‘రంగస్థలం’ కోసం అని ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. త్వరలో ఆరంభం కానున్న ‘సైరా’ కోసం చిరంజీవి కసరత్తులు చేస్తోంటే ‘రంగస్థలం’తో చరణ్‌ బిజీ బిజీగా ఉన్నారు. ఎంత బిజీగా ఉన్నా, ఎంత స్టార్స్‌ అయినా తండ్రి తండ్రే.. కొడుకు కొడుకే. అందుకే తండ్రితో కప్పు కాఫీ తాగుతూ, కాసేపు కబుర్లు చెప్పాలనుకున్నారు చరణ్‌.

‘‘నాన్నను కన్విన్స్‌ చేసి, కాఫీకి తీసుకెళ్లడం చాలా ఆనందంగా ఉంది’’ అని చరణ్‌ అన్నారు. ‘‘పేరెంట్స్‌తో పిల్లలు టైమ్‌ స్పెండ్‌ చేయడం చాలా ముఖ్యం. ముఖ్యంగా ఫాదర్‌ అండ్‌ సన్‌కి అది వెలకట్టలేని బహుమతి. తండ్రిలా కొడుకు.. కొడుకులా తండ్రి’’ అని చరణ్‌ సతీమణి ఉపాసన పేర్కొన్నారు. అంతేకదా.. పెద్దయ్యాక కొందరు మగపిల్లలు తండ్రితో ఏదో పొడిపొడిగా మాట్లాడతారు. దూరం దూరంగా ఉంటారు. కానీ, చరణ్‌ తన తండ్రికి చాలా క్లోజ్‌. ‘హీ ఈజ్‌ మై ఫ్రెండ్, గైడ్, ఫిలాసఫర్‌’ అని పలు సందర్భాల్లో చెప్పారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement