బడ్జెట్‌ 125 కోట్లు.. ఫస్ట్‌ కలెక్షన్‌..?

Manikarnika Box Office Collection Day 1 - Sakshi

ముంబై: భారీ అంచనాల నడుమ విడుదలైన ‘మణికర్ణిక’ సినిమా మొదటి రోజు సాధారణ వసూళ్లు మాత్రమే సాధించింది. దేశవ్యాప్తంగా తొలిరోజు కేవలం రూ.8.75 కోట్లు రాబట్టింది. ఈనెల 25న ప్రపంచవ్యాప్తంగా విడుదలైన ఈ సినిమాకు మొదటిరోజు ప్రేక్షకుల నుంచి మిశ్రమ స్పందన లభించింది. కంగనా రనౌత్‌ ప్రధాన పాత్రలో ఈ సినిమాకు విమ్శకుల నుంచి ప్రశంసలు దక్కాయి. దాదాపు రూ. 125 కోట్ల బడ్జెట్‌తో తెరకెక్కిన ఈ చిత్రాన్ని ప్రేక్షకులు ఎంతమేరకు ఆదరిస్తారనే దానిపై వసూళ్లు ఆధారపడనున్నాయి. వారాంతంలో వసూళ్లు పెరిగే అవకశాముందని మార్కెట్‌ విశ్లేషకులు అంచనా వేస్తున్నారు.

క్రిష్‌ జాగర్లమూడితో కలిసి కంగనా రనౌత్‌ ఈ సినిమాకు దర్శకత్వం వహించారు. విజయేంద్ర ప్రసాద్‌ రచనా సహకారం అందించారు. అతుల్‌ కులకర్ణి, డానీ డెంజొప్ప, జిషు సేన్‌గుప్తా, రిచర్డ్‌ కీప్‌ ఇతర ముఖ్య పాత్రల్లో నటించారు. (‘మణికర్ణిక’ మూవీ రివ్యూ)

Read latest Movies News and Telugu News | Follow us on FaceBook, Twitter

Advertisement

*మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది, *అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం, *ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరించబడతాయి, *వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి

Read also in:
Back to Top