విష్ణుకి విలన్గా మారిన నిర్మాత | Manchu Vishnu, MVV satyanarayana New Movie Luckunnodu | Sakshi
Sakshi News home page

విష్ణుకి విలన్గా మారిన నిర్మాత

Aug 22 2016 11:25 AM | Updated on Sep 4 2017 10:24 AM

విష్ణుకి విలన్గా మారిన నిర్మాత

విష్ణుకి విలన్గా మారిన నిర్మాత

ఆడోరకం ఈడోరకం సినిమాతో మంచి సక్సెస్ సాధించిన మంచు విష్ణు, హీరోగా తెరకెక్కుతున్న సినిమా లక్కున్నోడు. గీతాంజలి సినిమాతో దర్శకుడిగా గుర్తింపు తెచ్చుకున్న రాజ్ కిరణ్ దర్శకత్వంలో....

ఆడోరకం ఈడోరకం సినిమాతో మంచి సక్సెస్ సాధించిన మంచు విష్ణు, హీరోగా తెరకెక్కుతున్న సినిమా లక్కున్నోడు. గీతాంజలి సినిమాతో దర్శకుడిగా గుర్తింపు తెచ్చుకున్న రాజ్ కిరణ్ దర్శకత్వంలో ప్రముఖ నిర్మాత ఎమ్వివి సత్యనారాయణ ఈ సినిమాను నిర్మిస్తున్నాడు. అయితే ఇప్పుడు ఈ నిర్మాతే విష్ణుకు విలన్గా మారుతున్నాడట. నిర్మాణ రంగం మీదే కాక, నటన మీద కూడా ఆసక్తి ఉన్న సత్యనారాయణ లక్కున్నోడు చిత్రంలో మెయిన్ విలన్గా నటిస్తున్నాడు.

గీతాంజలి, శంకరాభరణం లాంటి చిత్రాలను నిర్మించిన ఎమ్వివి సత్యనారాయణ ప్రస్తుతం ప్రభుదేవ, తమన్నాలు ప్రధాన పాత్రల్లో తెరకెక్కుతున్న అభినేత్రి సినిమా తెలుగు వర్షన్ నిర్మాణ భాగస్వామిగా ఉన్నాడు. అదే సమయంలో మంచు విష్ణు హీరోగా లక్కున్నోడు చిత్రాన్ని నిర్మిస్తున్నాడు. తన రెండో సినిమా శంకరాభరణంలో గెస్ట్ రోల్లో నటించిన సత్యనారాయణ ఇప్పుడు మంచు విష్ణు హీరోగా తెరకెక్కుతున్న సినిమాతో మెయిన్ విలన్గా నటించేందుకు రెడీ అవుతున్నాడు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement