హీరో మంచు విష్ణు సంక్రాంతి సందర్భంగా ఓ గుడ్‌న్యూస్ చెప్పాడు. కొత్త టాలెంట్‌ను ప్రోత్సహించే లక్ష్యంతో ఒక పోటీ పెడుతున్నట్లు తెలిపాడు. అవా ఇంటర్నేషనల్ షార్ట్ ఫిలిం కాంటెస్ట్ - సీజన్ 1ను ప్రకటించాడు. మేరకు అవా ఎంటర్‌టైన్‌మెంట్స్ కీలక ప్రకటన చేసింది. ఈ పోటీలో పాల్గొనేవారు గరిష్టంగా 10 నిమిషాల నిడివి గల లఘు చిత్రాలను సమర్పించవచ్చని తెలిపింది.
కథ చెప్పడం, దర్శకత్వ దృష్టి ఆధారంగా విజేతలను నిర్ణయిస్తామంది. ఈ పోటీలో గెలుపొందిన దర్శకుడుకి పది కోట్ల బడ్జెట్‌తో సినిమా తీసే అవకాశాన్ని నటుడు, నిర్మాత మంచు విష్ణు కల్పించనున్నాడు. అర్హులైన దర్శకులను మెయిన్ స్ట్రీమ్ సినిమాల్లోకి తీసుకు రావడమే ఈ పోటీ ప్రధాన లక్ష్యం.


