
సాక్షి,తిరుపతి: మోహన్‌బాబు వర్సిటీపై వస్తున్న వార్తలను హీరో, మోహన్ బాబు యూనివర్శిటీ ప్రో-ఛాన్సలర్ మంచు విష్ణు ఖండించారు. ఈ మేరకు ఆయన బుధవారం (అక్టోబర్8న) ఓ నోట్‌ను విడుదల చేశారు.
అందులో.. యూనిర్సిటీకి అనుకూలంగా హైకోర్టు స్టే ఉత్తర్వులు ఉండగా.. వాటిని ధిక్కరించి ఉన్నత విద్యామండలి పోర్టల్లో పెట్టడమేంటి? అని ప్రశ్నించారు. ఉన్నత విద్యామండలి సిఫార్సులు సరికాదు. మా యూనివర్సిటీ ప్రతిష్టను దిగజార్చడానికి కొందరు సోషల్ దుష్ప్రచారం చేస్తున్నారు’ అంటూ మండిపడ్డారు.