మోహన్బాబు టాలీవుడ్ లెజండ్ అని ఎవరూ కాదనలేరు.. చిరంజీవి వంటి స్టార్ కంటే తెలుగు తెరపై మెరిసిన బాక్సాఫీస్ కలెక్షన్ల కింగ్.. వెండితెరపై ఆయన వైభవాన్ని ఇప్పటి తరం చూడలేదు. మోహన్బాబు నటించిన సినిమా వస్తుందంటే చాలు బాక్సాఫీస్ వద్ద కాసుల వర్షం.. అందుకే కలెక్షన్ కింగ్ అనే ట్యాగ్ ఇండస్ట్రీ ఇచ్చింది. ఆయన మాట ఒక అగ్నిపర్వతం.. కానీ, తన మనసు మంచు పర్వతం. 50 ఏళ్ల సుదీర్ఘ ప్రస్థానంలో 600 సినిమాల్లో ఎన్నో వైవిధ్యమైన పాత్రలతో మెప్పించారు. నటుడిగా, నిర్మాతగా, విద్యావేత్తగా ఎందరికో స్ఫూర్తిదాయకం మోహన్‌బాబు జీవితం. నవంబర్ 22 నాటికి తను ఇండస్ట్రీలోకి వచ్చి 50 ఏళ్లు పూర్తి కానున్నాయి. మోహన్బాబు హీరోగా నటించిన స్వర్గం నరకం సినిమా 1975 నవంబర్ 22న విడుదలైంది.

మోహన్‌బాబు యాభయ్యేళ్ల సినీ ప్రయాణాన్ని పురస్కరించుకుని నవంబరు 22న ఇండిస్ట్రీలో ఒక వేడుకను జరపాలని ఆయన కుమారుడు మంచు విష్ణు ఉన్నారు. నేటి నటీనటులకు మాత్రమే కాకుండా ఎందరికో స్ఫూర్తి నింపే తన ప్రయాణాన్ని గౌరవించుకునే క్రమంలో ‘MB50 - ఎ పెర్ల్ వైట్ ట్రిబ్యూట్’ (MB50 - A Pearl White Tribute) పేరుతో ఈ కార్యక్రమాన్ని నిర్వహించనున్నారు. ఒక నటుడిగా భారతీయ సినిమాకు ఆయన చేసిన సేవలను గుర్తు చేసుకునేలా చాలామంది సెలబ్రిటీలు పాల్గొననున్నారు.
నాన్నతో మనోజ్
మంచు ఫ్యామిలీలో కొంత కాలంగా వివాదాలు ఉన్న విషయం తెలిసిందే.. కుటుంబ ఆస్తి వ్యవహారంలో మోహన్‌బాబు, ఆయన కుమారుడు మనోజ్ మధ్య విభేదాలు ఉన్నాయి. దీంతో కుటుంబం అంతా వేర్వేరుగా ఉంది. ఇప్పటికే మంచు లక్ష్మీ తన కెరీర్ కోసం ముంబైలో ఉంటున్నారు. ఇలా అందరూ తమకు నచ్చినట్లు తలో దారి చూసుకున్నారు. అయితే, ఈ కార్యక్రమంతో వారందరూ తిరిగి కలిసిపోవాలని అభిమానులు కోరుతున్నారు. కనీసం ఈ సంతోషకరమైన ఈవెంట్తో అయినా సరే మంచు బ్రదర్స్ గతంలో మాదరి కనిపిస్తే చాలని ఫ్యాన్స్ ఆశిస్తున్నారు. మోహన్‌బాబు కూడా తన కుమారులను ఒక్కటిగా చూడాలనే ఆలచోనతో ఉన్నట్లు తెలుస్తోంది.


