శతమానం భవతి

Malayalam Actress Bhavana Marries Producer Naveen - Sakshi

కోరుకున్నవాణ్ణి పెళ్లి చేసుకోవటమే కదా ఏ ఆడపిల్లైనా ఆశపడేది. అది సాధారణ అమ్మాయి అయినా సరే హీరోయిన్‌ అయినా సరే. ఇప్పుడు భావన ఆ ఆనందంలోనే ఉన్నారు. ‘ఒంటరి, మహాత్మ’ వంటి సినిమాలతో తెలుగు ప్రేక్షకులకు దగ్గరైన ఈ మలయాళ కుట్టి తన ప్రేమికుడు నవీన్‌తో ఏడడుగులు వేశారు. నిన్న ఉదయం కేరళ త్రిస్సూర్‌లో ‘నవీన్‌’ను కేరళ స్టైల్‌లో పెళ్లి  చేసుకున్నారు భావన.

నవీన్‌ కన్నడ ఇండస్ట్రీకి చెందిన సినీ నిర్మాత. వధూవరుల కుటుంబ సభ్యులు, ఫ్యామిలీ ఫ్రెండ్స్, చాలా కొద్దిమంది ఇండస్ట్రీ ఫ్రెండ్స్‌ మధ్య ఈ పెళ్లి వేడుక జరిగింది. భావన ఫ్రెండ్స్, కథానాయికలు రమ్య నంబీసన్, నవ్య నాయర్, భామ ఈ పెళ్లిలో సందడి చేశారు. ఈ కొత్త జంటకు ఇండస్ట్రీకు చెందిన పలువురు సెలబ్రిటీలు ‘శతమానం భవతి’ అని శుభాకాంక్షలు తెలిపారు. త్రిస్సూర్‌లోని లూలూ కన్వెన్షన్‌ సెంటర్‌లో ఇండస్ట్రీ మరియు ఫ్యాన్స్‌ కోసం ప్రత్యేకంగా వెడ్డింగ్‌ రిసెప్షన్‌ ఏర్పాటు చేయనున్నారట.

Advertisement
Advertisement

*మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది, *అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం, *ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరించబడతాయి, *వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి

Back to Top