హాలీవుడ్‌ హీరో ఎఫ్‌బీ పేజీలో టాలీవుడ్‌ ఫ్యాన్స్‌ రచ్చ

Mahesh Fans trolls on Tom Cruise fb post - Sakshi

సాక్షి, హైదరాబాద్‌ : సోషల్‌ మీడియా వేదికగా సినీ నటుల అభిమానుల మధ్య వాగ్వాదం జరగడం సహజమే. కానీ ఇందుకు హాలీవుడ్‌ హీరో ఎఫ్‌బీ పేజీ వేదిక కావడమే ఇక్కడ విచిత్రం. తాజాగా హాలీవుడ్‌ హీరో అమెరికన్‌ నటుడు టామ్‌ క్రూజ్‌ ఓ ఫొటోను తన ఎఫ్‌బీ అకౌంట్‌లో షేర్‌ చేశాడు. అయితే ఈ పోస్ట్‌కు టాలీవుడ్‌ హీరో మహేశ్‌ బాబు అభిమాని ఒకరు టామ్‌ క్రూజ్‌ కన్నా మహేశ్‌ బాబు అందగాడని, ఏ విషయంలోనైనా ఎక్కువేనని కామెంట్‌ చేశాడు. ఈ కామెంట్‌పై ఎన్టీఆర్‌, పవన్‌ కళ్యాణ్‌ అభిమానులు సైతం స్పందించడంతో రచ్చ మొదలైంది.

మహేశ్‌ బాబు డ్యాన్స్‌పై వారు కామెంట్‌ చేయగా ఆయన అభిమానులు ఘాటుగా స్పందించారు. డ్యాన్స్‌ గురించి మాట్లాడటం కాదు కానీ మహేశ్‌ బాబు కేవలం 23 సినిమాలు చేసి 8 నంది అవార్డులు, 5 ఫిల్మ్‌ఫేర్‌ అవార్డులు, 21 టీఎస్‌ఆర్‌, 23 సంజయ్‌ దత్త్‌ అవార్డులు గెలుచుకున్నాడని బదులిస్తున్నారు. దీంతో ఈ వాగ్వాదం సోషల్‌ మీడియా వేదికగా తారా స్థాయికి చేరింది. ఇప్పుడి ఈ పోస్ట్‌ నెట్టింట్లో హల్‌చల్‌ చేస్తోంది.

Read latest Movies News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram

Advertisement

*మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది, *అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం, *ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరించబడతాయి, *వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి 

Read also in:
Back to Top