ప్రజల మనిషిగా కొనసాగండి : మహేష్‌ బాబు | Mahesh Babu Praises KTR | Sakshi
Sakshi News home page

Dec 11 2018 7:26 PM | Updated on Dec 11 2018 7:26 PM

Mahesh Babu Praises KTR - Sakshi

తెలంగాణ ఎన్నికల ఫలితాల్లో సంచలన విజయం నమోదు చేసిన తెలంగాణ రాష్ట్రసమితి నాయకులపై శుంభాకాం​క్షల జల్లు కురుస్తోంది. ఇప్పటికే పలువురు సినీ తారలు సోషల్‌ మీడియా ద్వారా విజేతలకు అభినందనలు తెలుపగా తాజాగా సూపర్‌ స్టార్‌ మహేష్‌​ బాబు కూడా తన స్నేహితుడు కేటీఆర్‌కు శుభాకాంక్షలు తెలిపాడు.

‘ఘన విజయం సాధించినందుకు శుభాకాంక్షలు. మీరు అన్ని రకాలుగా ఈ విజయానికి అర్హులు. ఇక ముందు కూడా ప్రజల మనిషిగా కొనసాగండి’  అంటూ ట్వీట్‌ చేశాడు మహేష్‌. చాలా కాలంగా మహేష్‌తో సన్నిహిత సంబంధాలు ఉన్న కేటీఆర్‌.. భరత్‌ అనే నేను సినిమా ప్రమోషన్‌ కార్యక్రమాల్లోనూ పాల్గొన్నారు.


Advertisement
 
Advertisement
Advertisement