‘మహర్షి’ డిలీటెడ్‌ సీన్‌

Mahesh Babu Maharshi Movie Deleted Scene - Sakshi

సూపర్‌స్టార్‌ మహేష్‌ బాబు మహర్షి చిత్రం బ్లాక్‌బస్టర్‌ హిట్‌గా నిలిచి..నేడు వందరోజుల పండుగను జరుపుకుంటోంది. వంశీ పైడిపల్లీ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ మూవీ సామాజిక సందేశంతో కూడుకుని, కమర్షియల్‌ అంశాలతో ఉండటంతో బాక్సాఫీస్‌ను బద్దలుకొట్టింది. 

సినిమా నిడివి ఎక్కువగా ఉండటంతో కొన్ని సీన్లకు కత్తెర వేశామని మూవీ ప్రమోషన్లలో చిత్రయూనిట్‌ పేర్కొన్నసంగతి తెలిసిందే. అయితే నేడు వందరోజులు అయిన సందర్భంగా.. ఈ మూవీ నుంచి తీసేసిన సన్నివేశాన్నిరిలీజ్‌ చేశారు. కాలేజ్‌లో గొడవకు సంబంధించిన ఈ సన్నివేశం అభిమానులను బాగానే ఆకట్టుకుంటోంది. మహర్షి తరువాత మహేష్‌ జెట్‌ స్పీడ్‌తో దూసుకుపోతూ.. సరిలేరు నీకెవ్వరూ చిత్రాన్ని రెడీ చేస్తున్నాడు.

Read latest Movies News and Telugu News | Follow us on FaceBook, Twitter

Advertisement

*మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది, *అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం, *ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరించబడతాయి, *వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి

Read also in:
Back to Top