మహేశ్‌, సుకుమార్ సినిమా కథ ఇదేనట!

Is Mahesh Babu And Sukumar New Movie Storyline Revealed - Sakshi

రంగస్థలం సినిమాతో సుకుమార్‌ సత్తా ఏంటో తెలిసింది జనాలకు. మాస్‌ సినిమాలు తీయలేడంటూ.. మాస్‌ ప్రేక్షకులను మెప్పించే సినిమాలను సుకుమార్‌ తీయలేడు అనే వారికి రంగస్థలంతో తన స్టామినా ఏంటో చూపించాడు. ఈ సినిమా మాస్‌, క్లాస్‌ తేడా లేకుండా అన్ని సెంటర్స్‌లో రికార్డు కలెక్షన్స్‌ సాధించాయి. సుకుమార్‌ తదుపరి చిత్రం మహేశ్‌ బాబుతో ఉంటుందని ఇదివరకే ప్రకటించిన విషయం తెలిసిందే.

భరత్‌ అనే నేను సినిమాతో మంచి విజయం సాధించిన ఈ సూపర్‌స్టార్‌ ప్రస్తుతం ఈ సక్సెస్‌ను ఎంజాయ్‌ చేస్తున్నాడు. వంశీ పైడిపల్లి డైరెక్షన్‌లో మహేశ్‌ బాబు తన తరువాతి చిత్రం చేయబోతున్నారు. దీని తర్వాత సుకుమార్‌ దర్శకత్వంలో సినిమాను చేయనున్నాడు. ఈ సినిమా సస్పెన్స్‌ థ్రిల్లర్‌ నేపథ్యంలో ఉండబోతోందట అంతేకాకుండా ఈ సినిమాలో మహేశ్‌ ఇన్వెస్టిగేటివ్‌ ఆఫీసర్‌గా కనిపించబోతోన్నట్లు తెలుస్తోంది. ఈ మేరకు సుకుమార్‌ తన స్క్రిప్టును తయారు చేసుకుంటున్నట్లు సమాచారం.

Read latest Movies News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top