కాన్సెప్ట్‌ దొరికింది | Madhur Bhandarkar says he hopes to make 'Fashion 2' | Sakshi
Sakshi News home page

కాన్సెప్ట్‌ దొరికింది

Nov 1 2018 2:57 AM | Updated on Aug 21 2019 10:25 AM

Madhur Bhandarkar says he hopes to make 'Fashion 2' - Sakshi

మధూర్‌ బండార్కర్‌

పదేళ్ల క్రితం బాలీవుడ్‌లో వచ్చిన ‘ఫ్యాషన్‌’ చిత్రం మంచి హిట్‌ టాక్‌ను సొంతం చేసుకుంది. మధూర్‌ బండార్కర్‌ దర్శకత్వంలో ప్రియాంకా చోప్రా, కంగనా రనౌత్, ముగ్ధా గాడ్సే, అర్జున్‌ బజ్వా కీలక పాత్రలు చేశారు. ఇప్పుడీ సినిమాకు సీక్వెల్‌ చేసే ఆలోచనలో ఉన్నట్లు మధూర్‌ బండార్కర్‌ పేర్కొన్నారు. ‘‘సమాజంలో జరుగుతున్న వాస్తవ సంఘటనల ఆధారంగానే నా సినిమాలు ఉంటాయి. ఈ ఫోకస్‌ను ఇలానే కొనసాగిద్దామనుకుంటున్నాను. ‘ఫ్యాషన్‌’ చిత్రం వచ్చి పదేళ్లు పూర్తయ్యింది. ఈ సినిమా కోసం పని చేసిన టీమ్‌ అందరికీ థ్యాంక్స్‌. ‘ఫ్యాషన్‌ 2’ చిత్రం కోసం ఓ కాన్సెప్ట్‌ను రెడీ చేశాను. కానీ ప్రస్తుతం నేను వర్క్‌ చేస్తోన్న ఇంకో సినిమా స్క్రిప్ట్‌ పని పూర్తవ్వగానే ‘ఫ్యాషన్‌ 2’ వర్క్‌ని స్టార్ట్‌ చేస్తా’’ అని పేర్కొన్నారు మధూర్‌ బండార్కర్‌.

Advertisement
 
Advertisement
Advertisement