సెన్సార్ పూర్తి చేసుకున్న 'లక్కున్నోడు' | Luckkunodu Completed Censor Formalities | Sakshi
Sakshi News home page

సెన్సార్ పూర్తి చేసుకున్న 'లక్కున్నోడు'

Jan 21 2017 10:08 AM | Updated on Sep 5 2017 1:46 AM

సెన్సార్ పూర్తి చేసుకున్న 'లక్కున్నోడు'

సెన్సార్ పూర్తి చేసుకున్న 'లక్కున్నోడు'

మంచు విష్ణు, హన్సిక జంటగా తెరకెక్కిన హిలేరియస్ ఎంటర్ టైనర్ లక్కున్నోడు.

మంచు విష్ణు, హన్సిక జంటగా తెరకెక్కిన హిలేరియస్ ఎంటర్ టైనర్ లక్కున్నోడు. గీతాంజలి ఫేమ్ రాజ్ కిరణ్ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ చిత్రం సెన్సార్ కార్యక్రమాలు పూర్తి చేసుకొని యు/ఎ సర్టిఫికెట్ అందుకొంది. ఎం.వి.వి సినిమా పతాకంపై ఎం.వి.వి.సత్యనారాయణ నిర్మిస్తున్న ఈ చిత్రాన్ని ఫిబ్రవరి 3న విడుదల చేసేందుకు సన్నాహాలు చేస్తున్నారు.

రొమాంటిక్ కామెడీ ఎంటర్ టైనర్గా తెరకెక్కిన ఈ చిత్రానికి డైమండ్ రత్నబాబు స్క్రీన్ ప్లే మాటలు అందించారు. దేనికైనా రెడీ, పాండవులు పాండవులు తుమ్మెద లాంటి సక్సెస్ ఫుల్ ఫిలిమ్స్ తర్వాత విష్ణు, హన్సిక జంటగా నటిస్తుండటంతో సెంటిమెంట్ పరంగా ఈ సినిమా కూడా సక్సెస్ సాధిస్తుందన్న నమ్మకంతో ఉన్నారు. దీనికి తోడు ఈడోరకం ఆడోరకం వంటి సూపర్ హిట్ తరువాత మంచు విష్ణు హీరోగా తెరకెక్కిన చిత్రం కావడంతో లక్కున్నోడుపై మంచి అంచనాలు నెలకొన్నాయి.

Advertisement
 
Advertisement
Advertisement