షారూఖ్ సినిమాకు నోటీసులు.? | legal notice to Dear Zindagi team for copyright infringement | Sakshi
Sakshi News home page

షారూఖ్ సినిమాకు నోటీసులు.?

Dec 14 2016 10:46 AM | Updated on Sep 4 2017 10:44 PM

షారూఖ్ సినిమాకు నోటీసులు.?

షారూఖ్ సినిమాకు నోటీసులు.?

ఇటీవల వరుస ఫ్లాప్లతో కష్టాల్లో పడ్డ షారూఖ్ ఖాన్, డియర్ జిందగీ సినిమాతో తిరిగి ఫాంలోకి వచ్చాడు. రోటీన్ కమర్షియల్ ఫార్ములాకు భిన్నంగా గ్లోబలైజేషన్ నేపథ్యంలో తెరకెక్కిన..

ఇటీవల వరుస ఫ్లాప్లతో కష్టాల్లో పడ్డ షారూఖ్ ఖాన్, డియర్ జిందగీ సినిమాతో తిరిగి ఫాంలోకి వచ్చాడు. రోటీన్ కమర్షియల్ ఫార్ములాకు భిన్నంగా గ్లోబలైజేషన్ నేపథ్యంలో తెరకెక్కిన డియర్ జిందగీ మంచి వసూళ్లతో దూసుకుపోతోంది. అయితే ఈ సినిమా ఓ కెనడియన్ టీవీ సీరీస్కు కాపీ అన్న వాదన రిలీజ్కు ముందు నుంచే వినిపిస్తోంది. సినిమా రిలీజ్ తరువాత ఆ టాక్ మరింత ఎక్కువైంది.

ఇంగ్లీష్ వింగ్లీష్ సినిమాతో దర్శకురాలిగా మంచి గుర్తింపు తెచ్చుకున్న గౌరీషిండే.. షారూఖ్, అలియా భట్లు లీడ్ రోల్లో డియర్ జిందగీ సినిమాను తెరకెక్కించారు. అయితే ఈ సినిమా కెనడియన్ టీవీ సీరీస్ 'బీయింగ్ ఎరికా'కు కాపీ అన్న టాక్ పెద్ద ఎత్తున వినిపించింది. షారూఖ్ లాంటి స్టార్ హీరో సినిమా కావటంతో ఆ టాక్ ఒరిజినల్ వర్షన్ మేకర్స్ వరకు చేరిందట. దీంతో బీయింగ్ ఎరికా యూనిట్ సభ్యులు నిర్మాత కరణ్ జోహార్తో పాటు షారూఖ్ ఖాన్లకు నోటిసులు పంపించారన్న టాక్ వినిపిస్తోంది. అయితే ఈ విషయంపై డియర్ జిందగీ యూనిట్ సభ్యులు మాత్రం స్పందించలేదు.

Advertisement
 
Advertisement
Advertisement