వంద రోజుల స్నేహం | ks100 movie trailer release | Sakshi
Sakshi News home page

వంద రోజుల స్నేహం

Jan 21 2019 2:34 AM | Updated on Jan 21 2019 2:34 AM

ks100 movie trailer release - Sakshi

సమీర్‌ ఖాన్,సునీత పాండే

‘‘షిరాజ్‌ కాన్ఫిడెన్స్‌ నాకు చాలా బాగా నచ్చుతుంది. అతనికి సినిమా తీయడమే కాకుండా ఎలా ప్రమోట్‌ చేయాలో కూడా బాగా తెలుసు. ప్రేక్షకులని కూర్చోబెట్టే ప్రతిభ ఒక్క దర్శకుడికే ఉంటుంది. అది షిరాజ్‌కు ఉంది. తను హీరోగా పరిచయం అయ్యి దర్శకుడిగా మంచి ప్రతిభ కనబరుస్తున్నాడు’’ అని నిర్మాత సాయి వెంకట్‌ అన్నారు. సమీర్‌ ఖాన్, శైలజ, సునీత పాండే, ఆశి రాయ్, శ్రద్ధ, అక్షత ముఖ్య తారలుగా షిరాజ్‌ (షేర్‌) దర్శకత్వంలో తెరకెక్కిన చిత్రం ‘కెఎస్‌ 100’.

చంద్రశేఖర్‌ మూవీస్‌ పతాకంపై కె. వెంకట్‌రామ్‌ రెడ్డి నిర్మించిన ఈ చిత్రం ట్రైలర్‌ని నిర్మాతలు సాయి వెంకట్, మల్టీ డైమెన్షన్‌ వాసు, అట్లూరి రామకృష్ణ విడుదల చేశారు. షిరాజ్‌ మాట్లాడుతూ– ‘‘ఈ తరం అమ్మాయిలు ఏవిధంగా ఫాస్ట్‌ కల్చర్‌ను అలవర్చుకున్నారు అనే పాయింట్‌తో తెరకెక్కించిన చిత్రమిది. కెఎస్‌ అంటే హీరోల పాత్ర పేరు కుమార్, స్వామి. 100 అంటే వాళ్ల వంద రోజుల స్నేహమే. మంచి మెసేజ్‌ ఓరియంటెడ్‌ ఫిల్మ్‌. సస్పెన్స్‌ థ్రిల్లర్‌గా తెరకెక్కించాం. ఈ చిత్రంలో నటించిన వారికి మంచి ప్రతిభ ఉండటంతో వీరితో మరో సినిమా చేయనున్నాం’’ అన్నారు. ‘‘హారర్, థ్రిల్లర్, రొమాంటిక్‌ మూవీ ఇది. అందరికీ నచ్చుతుందనే నమ్మకం ఉంది’’ అని వెంకటరామ్‌ రెడ్డి అన్నారు. సమీర్‌ ఖాన్, సునీతా పాండే, అక్షత, కూసెట్టి, అజీబ్, సంగీత దర్శకుడు నవనీత్‌ చారి తదితరులు పాల్గొన్నారు.
∙సమీర్, సునీత

Advertisement
 
Advertisement
Advertisement