ఆ సీన్లు అనుకోకుండా తీశారు.. క్షమించండి | Kollywood Actress Apologies for Hot Scenes in Teaser | Sakshi
Sakshi News home page

హాట్ సీన్లపై కోలీవుడ్ నటి క్షమాపణలు

Nov 9 2017 4:08 PM | Updated on Aug 20 2018 2:50 PM

Kollywood Actress Apologies for Hot Scenes in Teaser - Sakshi

సాక్షి, చెన్నై : అతుల్య రవి కోలీవుడ్‌లో సెన్సేషన్‌ హీరోయిన్‌. ఈ ఏడాది మొదట్లో వచ్చిన కాదల్ కన్‌ కట్టుదే చిత్రంతో యూత్‌లో ఫ్యాన్స్‌ ఫాలోయింగ్ పెంచుకుంది. తక్కువ బడ్జెట్ చిత్రంగా వచ్చిన ఈ ప్రేమకథా చిత్రం ఘన విజయం సాధించటంలో ఆమెదే కీలక పాత్ర కూడా. చాలా పద్ధతిగా నటించిందంటూ విమర్శకులు సైతం ఆమెపై ప్రశంసలు కురిపించారు. 

కట్ చేస్తే... ఐదు రోజుల క్రితం ఆమె నటించిన కొత్త చిత్రం యెమాలి చిత్ర టీజర్ విడుదల అయ్యింది. అందులో ఆమె ఎక్స్ పోజింగ్ చూసిన వాళ్లంతా ముక్కున్న వేలేసుకున్నారు. పొట్టి బట్టలు, అసభ్య సైగలు, మందు-సిగరెట్‌ తాగటం, హాట్ సీన్లలో రెచ్చిపోవటం చేసింది. అంతే అప్పటిదాకా ఆమె అభిమానులుగా ఉన్నవారంతా ఒక్కసారిగా ఆగ్రహాం వ్యక్తం చేయటం ప్రారంభించారు. సోషల్ మీడియాలో అతుల్య రవి అసభ్య పదజాలంతో దూషిస్తూ ట్రోల్ చేయసాగారు. దీంతో ఆమె స్పందించి తన ఫేస్‌బుక్‌లో ఓ పోస్టు పెట్టారు. 

టీజర్లో తన క్యారెక్టరైజేషన్‌ను చూసి తప్పుగా అనుకోవద్దని.. పాత్రకు అనుగుణంగానే తాను అలా నటించాల్సి వచ్చిందని తెలిపింది. పైగా యాధృచ్ఛికంగా అవి చిత్రీకరణ జరిగాయంటూ చెప్పింది. సినిమాలో ఆ సన్నివేశాలు ఉండబోవని చెబుతూ తనను అభిమానించేవారికి క్షమాపణలు తెలియజేసింది. ఈ విషయంలో ఇప్పటికే దర్శకుడికి ఆమె విజ్ఞప్తి కూడా చేసినట్లు సమాచారం. అయితే అంతలా ప్రచారం తెచ్చిపెడుతున్న ఆ సీన్లను తొలగించేందుకు దర్శకుడు అంగీకరిస్తాడా? అన్నది అనుమానమే. డైరెక్టర్ కమ్‌ నటుడు సముద్రఖని ఓ ప్రధాన పాత్ర పోషించిన యోమాలి చిత్రానికి వీజే ధొరై దర్శకత్వం వహించాడు. 

Advertisement
 
Advertisement
Advertisement