రజనీ కూతురుపై అమితాబ్ ప్రశంసల వర్షం! | 'Kochadaiiyan' women empowerment at its best: Amitabh Bachchan | Sakshi
Sakshi News home page

రజనీ కూతురుపై అమితాబ్ ప్రశంసల వర్షం!

Mar 31 2014 4:43 PM | Updated on Sep 2 2017 5:24 AM

రజనీ కూతురుపై అమితాబ్ ప్రశంసల వర్షం!

రజనీ కూతురుపై అమితాబ్ ప్రశంసల వర్షం!

'కొచ్చడయాన్' దర్శకురాలు, రజనీకాంత్ కుమార్తె సౌందర్య అశ్విన్ పై బాలీవుడ్ సూపర్ స్టార్ అమితాబ్ బచ్చన్ తన బ్లాగ్ లో ప్రశంసల వర్షం కురిపించారు.

'కొచ్చడయాన్' దర్శకురాలు, రజనీకాంత్ కుమార్తె సౌందర్య అశ్విన్ పై బాలీవుడ్ సూపర్ స్టార్ అమితాబ్ బచ్చన్ తన బ్లాగ్ లో ప్రశంసల వర్షం కురిపించారు. మహిళా సాధికారతకు సౌందర్య నిదర్శనమని బిగ్ బీ వ్యాఖ్యలు చేశారు. భారత దేశపు తొలి మోషన్ క్యాప్చర్ ఫోటో రియలిస్టిక్ 3D యానిమేటెడ్ చిత్రాన్ని సౌందర్య అశ్విన్ తెరకెక్కించారు. నిజంగా భారత దేశం గర్వించదగిన విషయమని బిగ్ బీ అన్నారు. 
 
కొచ్చడయాన్ చిత్ర హిందీ ట్రైలర్ ను ఆదివారం సాయంత్రం విడుదల చేయడం గర్వంగా ఉంది అని ఆయన అన్నారు. దేశంలో తొలి అత్యుత్తమ సాంకేతికత కలిగిన చిత్రాన్ని ఓ మహిళ ప్రయత్నించి, సఫలం కావడం తనకు గర్వంగా ఉందన్నారు. తన కూతురిపై విశ్వాసం ఉంచి, సపోర్ట్ చేయడం అభినందనీయమని అమితాబ్ అన్నారు. రజనీకాంత్ నటించిన ఈ చిత్రంలో దీపికా పదుకొనే, జాకీ ష్రాఫ్, శరత్ కుమార్, శోభన, ఆదీ పినిశెట్టి, నాజర్, రుక్మిణి లు ప్రాధాన పాత్రలో నటించారు. 
 

Advertisement
Advertisement
 
Advertisement
Advertisement