ఎంత పని చేశావు కియారా..?! | Kiara Advani Cuts Her Hair Short In Viral Video | Sakshi
Sakshi News home page

ఎంత పని చేశావు కియారా..?!

Apr 30 2019 7:43 PM | Updated on Apr 30 2019 7:48 PM

Kiara Advani Cuts Her Hair Short In Viral Video - Sakshi

ఆడపిల్లలకు జుట్టు అంటే ఎంత ప్రేమో ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. కేశ సంరక్షణ కోసం ఎన్నో జాగ్రత్తలు తీసుకుంటారు. ఇప్పటికి చాలామంది ఆడపిల్లలు జుట్టు కత్తింరించుకోవడానికి ఇష్టపడరు. కానీ నటి కియారా అద్వానీ మాత్రం ఓ కత్తేర పట్టుకుని స్వయంగా జుట్టు కత్తిరించేసుకుంది. ఇందుకు సంబంధించిన వీడియోను ఇన్‌స్టాగ్రామ్‌లో పోస్ట్‌ చేయడంతో ప్రస్తుతం అది తెగ వైరలవుతోంది. కియారా ఇంత కఠిన నిర్ణయం తీసుకోవడానికి ఓ కారణం ఉందట. ‘షూటింగ్‌లతో బిజీగా ఉండటం మూలానా నా జుట్టు గురించి పట్టించుకునే తీరిక దొరకడం లేదు. నా జుట్టును చాలా నిర్లక్ష్యం చేస్తున్నాను. ఇందుకు శిక్షగా స్వయంగా నా చేతులతో నేనే జుట్టు కత్తిరించుకున్నాను’ అని తెలిపారు.

అంతేకాక ‘కొన్ని రోజుల క్రితం మా కజిన్‌ పెళ్లికి వెళ్లేటపుడు మా అమ్మ నన్ను చక్కగా చీర కట్టుకోమని కోరింది. కానీ అంతసేపు సింగారించుకునే టైం లేక మార్కెట్‌లో రెడీమేడ్‌గా దొరికే చీర కట్టుకున్నాను. ఇక బిజీ షెడ్యూల్స్‌తో క్షణం తీరిక లేని ఈ రోజుల్లో జుట్టు పెంచుకోవడం, దానికి మెరుగులు దిద్దడం కోసం నూనె రాసుకోవడం తెగ చిరాకుగా ఉంద’ని తెలిపిన కియారా.. కత్తెరతో టకా టకా తన జుట్టును తానే స్వయంగా కత్తిరించుకుంది. ప్రస్తుతం సోషల్‌ మీడియాలో వైరలవుతోన్న ఈ వీడియో పట్ల నెటిజన్లు పలు రకాలుగా స్పందిస్తున్నారు.

‘మరి అంత చిరాకు అయితే ఎలా కియారా’.. ‘ఎంత పని చేశావు కియారా’ అని కొందరు కామెంట్‌ చేస్తుంటే.. మరి కొందరు మాత్రం ‘పొట్టి జుట్టు కూడా నీకు చాలా బాగా సూట్‌ అయ్యింది. చాలా అందంగా.. కూల్‌గా ఉన్నావం’టూ కామెంట్‌ చేస్తున్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement