నటి కుష్బూ డాక్టరయ్యారు!  | Khushbu Is Honored With A Doctorate | Sakshi
Sakshi News home page

నటి కుష్బూ డాక్టరయ్యారు! 

Mar 7 2020 8:02 AM | Updated on Mar 7 2020 8:02 AM

Khushbu Is Honored With A Doctorate - Sakshi

సాక్షి, పెరంబూరు: నటి కుష్బూ డాక్టరయ్యారు. ఇదేమిటీ ఆమె యాక్టర్‌ కదా అని ఆశ్యర్యపడుతున్నారా? ఉత్తరాదికి చెందిన కుష్బూ తెలుగు, తమిళం సహా వివిధ భాషల్లో 20 ఏళ్లకు పైగా నటిస్తున్నారు. తెలుగు చిత్రం కలియుగపాండవులు చిత్రం ద్వారా దక్షిణాదిలో కథానాయకిగా పరిచయం అయ్యారు. ఆ తరువాత తమిళ సినీరంగంలోకి ఎంట్రీ ఇచ్చారు. తమిళంలోనే అత్యధిక చిత్రాలను చేశారు. హీరోయిన్‌ నుంచి క్యారెక్టర్‌ ఆర్టిస్ట్‌గా అనేక చిత్రాల్లో నటించారు. తమిళంలో రజనీకాంత్, కమలహాసన్‌ వంటి సూపర్‌స్టార్స్‌తో జత కట్టిన నటి కుష్బూ. చదవండి: అదే నిజమైన ఉమెన్స్‌ డే 

ప్రస్తుతం రజనీకాంత్‌కు జంటగా అన్నాత్తా చిత్రంలో నటిస్తున్నారు. కాగా బుల్లితెరపై కూడా నటిగా తనదైన ముద్రవేసుకున్న ఈ సంచలన నటి నిర్మాతగా మారి పలు చిత్రాలను, టీవీ సీరియళ్లను నిర్మిస్తున్నారు. ఇక రాజకీయాల్లోనూ ప్రముఖ పాత్ర పోషిస్తున్నారు. ప్రస్తుతం అఖిల భారత కాంగ్రెస్‌ పార్టీ ప్రచార కర్తగా బాధ్యతలను నిర్వహిస్తున్న కుష్బూ సినీ సేవలకు గానూ అమెరికాలోని ప్రపంచ తమిళ విశ్వవిద్యాలయం గౌరవ డాక్టరేట్‌ను అందించి గౌరవించారు. గురువారం నటి కుష్బూ డాక్టరేట్‌ అవార్డును అందుకున్నారు. ఈ విషయాన్ని ఆమె తన ట్విట్టర్‌లో పేర్కొన్నారు. 
 

Advertisement
 
Advertisement
Advertisement