బాలయ్యతో పోటీకి మెగాస్టార్ రెడీ! | khaidi no 150 movie release on sankranti | Sakshi
Sakshi News home page

బాలయ్యతో పోటీకి మెగాస్టార్ రెడీ!

Oct 3 2016 12:13 PM | Updated on Aug 29 2018 1:59 PM

బాలయ్యతో పోటీకి మెగాస్టార్ రెడీ! - Sakshi

బాలయ్యతో పోటీకి మెగాస్టార్ రెడీ!

చాలా కాలం తర్వాత ఇద్దరు సీనియర్ అగ్ర కథానాయకుల సినిమాలు సంక్రాంతికి విడుదలకు సిద్ధమవుతుండడం అభిమానుల్లో ఆసక్తి రేకెత్తిస్తోంది.

మెగాస్టార్ చిరంజీవి కథానాయకుడిగా న‌టిస్తున్న `ఖైదీ నంబ‌ర్ 150` సంక్రాంతి కానుక‌గా జ‌న‌వ‌రిలో రిలీజ‌వుతోంది. ఈ చిత్రంలో అందాల‌ కాజ‌ల్ క‌థానాయిక‌గా న‌టిస్తోంది. వి.వి.వినాయక్ ఈ క‌మ‌ర్షియ‌ల్ ఎంట‌ర్‌టైన‌ర్‌కి దర్శకత్వం వహిస్తున్నారు. కొణిదెల ప్రొడక్షన్‌ కంపెనీ పతాకంపై మెగాపవర్‌స్టార్ రామ్‌చ‌ర‌ణ్‌ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ఇటీవ‌ల రిలీజైన మెగాస్టార్ స్టిల్స్‌కి, మోష‌న్ పోస్ట‌ర్‌కి చ‌క్క‌ని స్పంద‌న వ‌చ్చినందుకు చిత్ర‌యూనిట్ ఎంతో హ్యాపీగా ఉంది. ఇప్ప‌టికే 70 శాతం చిత్రీకరణ పూర్తయింది. 2017 సంక్రాంతి కానుక‌గా ఈ చిత్రాన్ని రిలీజ్ చేయ‌నున్నారు.

నిర్మాత రామ్‌చ‌ర‌ణ్ మాట్లాడుతూ.. ``70 శాతం పైగా చిత్రీక‌ర‌ణ పూర్త‌యింది. నాన్న‌గారు డ‌బ్బింగ్ కూడా ప్రారంభించారు. ఇప్ప‌టివ‌ర‌కూ చ‌క్క‌ని ఔట్‌పుట్ వ‌చ్చింద‌న్న సంతృప్తి ఉంది. అన్ని ప‌నులు పూర్తి చేసి, జ‌న‌వ‌రిలో సంక్రాంతి కానుక‌గా `ఖైదీ నంబ‌ర్ 150` చిత్రాన్ని రిలీజ్ చేస్తున్నాం`` అన్నారు. ర‌త్న‌వేలు ఈ చిత్రానికి ఛాయాగ్ర‌హ‌ణం అందిస్తున్నారు. దేవీశ్రీ ప్ర‌సాద్ అద్భుత‌మైన ట్యూన్స్ రెడీ చేస్తున్నారు. ఈ చిత్రంలో బాలీవుడ్ న‌టుడు త‌రుణ్ అరోరా విల‌న్ పాత్ర‌లో న‌టిస్తున్నారు.

కాగా, నందమూరి నట సింహం బాలయ్య ఇప్పటికే సంక్రాంతి రేసులో నిలిచాడు. నందమూరి బాలకృష్ణ వందో సినిమా ‘గౌతమిపుత్ర శాతకర్ణి’ సినిమా సంక్రాంతికి విడుదల కానుంది. జనవరి 12న ఈ సినిమాను విడుదల చేసేందుకు చిత్రయూనిట్ రెడీ అవుతోంది. చాలా కాలం తర్వాత ఇద్దరు సీనియర్ అగ్ర కథానాయకుల సినిమాలు సంక్రాంతికి విడుదలకు సిద్ధమవుతుండడం అభిమానుల్లో ఆసక్తి రేకెత్తిస్తోంది.

Advertisement
 
Advertisement
Advertisement