మెగాస్టార్‌తో మహానటి!

Keerthy Suresh in Chiranjeevi And Koratala Siva Movie - Sakshi

సావిత్రి బయోపిక్‌గా తెరకెక్కిన మహానటి సినిమాతో స్టార్ ఇమేజ్‌ సొంతం చేసుకున్న హీరోయిన్‌ కీర్తి సురేష్‌. ఈ సినిమా తరువాత తెలుగులో మరే సినిమాకు అంగీకరించని కీర్తి తాజాగా ఓ భారీ ప్రాజెక్ట్‌కు ఒప్పుకున్నట్టుగా తెలుస్తోంది. ఖైదీ నంబర్‌ 150 సినిమాతో రీ ఎంట్రీ ఇచ్చిన మెగాస్టార్ చిరంజీవి ప్రస్తుతం స్వాతంత్ర్య సమరయోధుడు ఉయ్యాలవాడ నరసింహారెడ్డి జీవిత కథ ఆధారంగా తెరకెక్కుతున్న సైరా నరసింహారెడ్డి సినిమాలో నటిస్తున్నాడు.

ఈ సినిమా తరువాత కొరటాల శివ దర్శకత్వంలో ఓ సినిమా చేయనున్నాడు చిరు. ఈ సినిమాలో చిరుకు జోడిగా కీర్తి సురేష్‌ను తీసుకునే ఆలోచనలో ఉన్నారట. ముందుగా ఈ పాత్రకు నయనతార, అనుష్క లాంటి హీరోయిన్ల పేర్లను పరిశీలించిన ఫైనల్‌గా కీర్తి అయితే బెటర్‌ అని ఫిక్స్‌ అయ్యారట. మరి కీర్తి సురేష్‌ ఈ ప్రాజెక్ట్ కు ఓకే చెపుతుందా లేదా చూడాలి.

Read latest Movies News and Telugu News | Follow us on FaceBook, Twitter

Advertisement

*మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది, *అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం, *ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరించబడతాయి, *వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి

Read also in:
Back to Top