‘మోదీతో డిన్నర్‌ చేయాలని ఉంది’ | Katrina Kaif Wants To Have Dinner With Narendra Modi | Sakshi
Sakshi News home page

మనసులో మాట బయటపెట్టిన కత్రినా

Jun 1 2019 8:21 PM | Updated on Jun 1 2019 8:33 PM

Katrina Kaif Wants To Have Dinner With Narendra Modi - Sakshi

ప్రధాని నరేంద్ర మోదీ పాపులారిటీ రోజు రోజుకు పెరిగిపోతుంది. తాజాగా ఆయనను అభిమానించే వారి జాబితాలో బాలీవుడ్‌ హీరోయిన్‌ కత్రినా కైఫ్‌ కుడా చేరారు. మోదీతో కలిసి డిన్నర్‌ చేయాలని ఉంది అంటున్నారు కత్రినా. ప్రస్తుతం భారత్‌ చిత్రం ప్రమోషన్‌ కార్యక్రమాలతో బిజీగా ఉన్నారు కత్రినా. ఇందులో భాగంగా ఓ ఆంగ్ల మీడయా సంస్థ ఏర్పాటు చేసిన ఇంటర్వ్యూలో పాల్గొన్నారు కత్రినా, సల్మాన్‌ ఖాన్‌. ఈ సందర్భంగా ‘ఒక వేళ అవకాశం వస్తే బతికున్న వారిలో లేదా.. చనిపోయిన వారిలో కానీ ఏ ముగ్గురితో కలిసి డిన్నర్‌ చేయాలని భావిస్తున్నార’ని ప్రశ్నించారు. అందుకు కత్రినా ‘మార్లిన్‌ మన్రో, నరేంద్ర మోదీ, కాండోలిజా రైస్‌’ అని బదులిచ్చారు.

‘అదేంటి సల్మాన్‌తో డిన్నర్‌ చేయాలని కోరుకోవడం లేదా’ అని ప్రశ్నించగా.. ‘ఇంత వరకూ నేను సల్మాన్‌తో డిన్నర్‌ చేయలేదు. ఎందుకంటే అతను బయట భోజనం చేయడ’ని తెలిపారు కత్రినా కైఫ్‌. వెంటనే సల్మాన్‌ స్పందిస్తూ.. ‍‘6.30 గంటలకు కత్రినా డిన్నర్‌ పూర్తవుతుంది. ఆ టైంకి నేను లంచ్‌ చేస్తాను. కాబట్టి కత్రినతో డిన్నర్‌ చేయడం కుదరద’ని తెలిపారు. ‘మరి మీరు ఎవరితో డిన్నర్‌ చేయాలనుకుంటున్నార’ని సల్మాన్‌ను అడగ్గా.. ‘నేను, నాకు, నాతో’ అంటూ భిన్నంగా స్పందించారు సల్మాన్‌. అంతేకాక ‘నాకు కుటుంబంతో కలిసి భోజనం చేయడం అలవాటు’ అన్నారు. అయితే సల్మాన్‌ సమాధానం నచ్చని కత్రినా.. ‘కనీసం మహాత్మ గాంధీ, మదర్‌ థెరిస్సా, నెహ్రూ వీరిలో అయినా ఎవరో ఒకరిని సెలక్ట్‌ చేసుకోమ’ని కోరింది.

అందుకు సల్మాన్‌ వారితో కలిసి భోజనం చేయడానికి ఇంకా చాలా టైం ఉందన్నారు. ఇక సల్మాన్‌, కత్రినా జంటగా నటించిన భారత్‌ చిత్రం ఈ నెల 5న విడుదలువుతున్న సంగతి తెలిసిందే. (చదవండి : ‘నా పిల్లలకు ఆ పరిస్థితి రాకూడదు’)

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement