అప్పుడు తమన్నా.. ఇప్పుడు కేథరిన్‌

Katherine Teresa Refuses To Act In Balayya's New Movie - Sakshi

నందమూరి బాలకృష్ణ, బోయపాటి శ్రీనుల కాంబినేషన్‌లో తెరకెక్కిస్తున్న సినిమాలో నటించడానికి హీరోయిన్‌ కేథరిన్‌ థెరిసా నో చెప్పిందట. రూలర్‌ సినిమా తర్వాత బాలయ్య నటించే భారీ బడ్జెట్‌ సినిమా ఇది. ఇప్పటికే ఈ సినిమాలో కేథరిన్‌ను హీరోయిన్‌గా ఫైనల్‌ చేసినా.. రెమ్యునరేషన్‌ విషయంలో రాజీ కుదరలేదట. బాలయ్యతో జోడీ కట్టేందుకు దాదాపు కోటి రూపాయలు డిమాండ్‌ చేసిందట ఈ భామ. ఇంత భారీ మొత్తం ఇవ్వడానికి నిర్మాతలు నిరాకరించడంతో కేథరిన్‌.. ఈ అవకాశాన్ని వదులుకున్నట్టు టాలీవుడ్‌ టాక్‌. 2013లో చమ్మక్‌ చల్లో అనే సినిమాతో టాలీవుడ్‌లో ఎంట్రీ ఇచ్చిన కేథరిన్‌.. ‘ఇద్దరమ్మాయిలతో’  సినిమాతో హీరోయిన్‌గా మంచి గుర్తింపు సంపాదించుకుంది.

గతంలో వరుస ఫ్లాపుల్లో ఉన్న బాలకృష్ణకు 'సింహా' వంటి బ్లాక్ బస్టర్‌తో మంచి సక్సెస్ అందించాడు బోయపాటి శ్రీను. ఆ తర్వాత వీళ్లిద్దరి కాంబోలో వచ్చిన 'లెజెండ్' మూవీ అంతకు మించిన సక్సెస్ సాధించింది. తాజాగా వీళ్లిద్దరి కాంబినేషన్‌లో తెరకెక్కుతున్న మూడో  సినిమా కావడంతో  ప్రేక్షకుల్లో అంచనాలు పెరిగాయి. ఇలాంటి క్రేజీ కాంబినేషన్‌లో నటించే అవకావాన్ని రెమ్యునరేషన్‌ కోసం మిస్‌ చేసుకుంది కేథరిన్‌. ఇదిలా ఉండగా ఈ చిత్రంలో బాలయ్య సరసన నటించే హీరోయిన్‌ కోసం బోయపాటికి తంటాలు తప్పడం లేదు. తరచుగా ఏదో ఒక హీరోయిన్‌ పేరు వినిపించడం.. తీరా సదరు బ్యూటీ ఆ వార్తలని ఖండించడం మామూలైపోయింది. కేథరిన్‌కి ముందు చిత్ర యూనిట్‌.. మిల్క్‌ బ్యూటీ తమన్నాను సంప్రదించగా ఆమె సున్నితంగా తిరస్కరించింది. ఆ మధ్యన బాలీవుడ్‌ బ్యూటీ సోనాక్షి సిన్హా బాలయ్యతో జోడీ కట్టనుందని వార్తలు వినిపించినా సోనాక్షి వాటిని ఖండించింది. మొత్తానికి బాలయ్యకు హీరోయిన్‌ని వెతకడం బోయపాటికి పెద్ద సవాల్‌గా మారినట్లు ఉంది.

చదవండి: ‘రూలర్‌’ మూవీ రివ్యూ

Read latest Movies News and Telugu News | Follow us on FaceBook, Twitter

Advertisement

*మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది, *అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం, *ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరించబడతాయి, *వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి

Read also in:
Back to Top