నో రెస్ట్‌ | karthi dev movie shooting starts in manali | Sakshi
Sakshi News home page

నో రెస్ట్‌

Oct 13 2018 6:04 AM | Updated on Jul 23 2019 11:50 AM

karthi dev movie shooting starts in manali - Sakshi

కార్తీ

తాజా చిత్రం ‘దేవ్‌’ కోసం ఫుల్‌ స్పీడ్‌తో రెస్ట్‌ లేకుండా పని చేస్తున్నారు కార్తీ అండ్‌ టీమ్‌. ఎన్ని అడ్డంకులొచ్చినా వెనక్కి తగ్గకుండా షూటింగ్‌ పూర్తి చేస్తున్నారు. రజత్‌ రవిశంకర్‌ దర్శకత్వంలో కార్తీ, రకుల్‌ జంటగా తెరకెక్కుతున్న చిత్రం ‘దేవ్‌’. మనాలీలో వచ్చిన వరదల వల్ల ఈ సినిమా షూటింగ్‌ సెప్టెంబర్‌లో వాయిదా పడిన సంగతి తెలిసిందే. అప్పుడు ఆగిపోయిన షెడ్యూల్‌ను పూర్తి చేయనున్నారట. అలాగే ఎవరెస్ట్‌ శిఖరం దగ్గర కొంత భాగం షూట్‌ చేయనున్నారట చిత్రబృందం. ‘‘మనాలీతో పాటు ఎవరెస్ట్‌ శిఖరం దగ్గర్లో, నేపాల్‌ వంటి మంచు ప్రాంతాల్లో షూటింగ్‌ చేయనున్నాం’’ అని చిత్రబృందం పేర్కొంది.

Advertisement
 
Advertisement
Advertisement