ఎప్పటికైనా ఆ ఒక్కడినే అనుమతిస్తా: కరీనా | Kareena kapoor Shares First Pic With Son Taimur On Instagram | Sakshi
Sakshi News home page

తైమూర్‌తో కలిసి దిగిన ఫోటోను షేర్‌ చేసిన కరీనా

Mar 7 2020 5:26 PM | Updated on Mar 7 2020 5:52 PM

Kareena kapoor Shares First Pic With Son Taimur On Instagram - Sakshi

బాలీవుడ్‌ స్టార్‌ కరీనా కపూర్‌ శుక్రవారం ఇన్‌స్టాగ్రామ్‌లో అడుగుపెట్టిన విషయం తెలిసిందే. ఈ సందర్భంగా కరీష్మా కపూర్‌ చెల్లెలు కరీనాకు వెల్‌కమ్‌ చెప్పారు. ఇన్‌స్టాలో చేరిన రెండో రోజే కరీనా 1 మిలియన్‌ ఫాలోవర్స్‌ను సొంతం చేసుకున్నారు. దీంతో కరీనాకు అభిమానుల్లో ఉన్న క్రేజ్‌ ఎంటో అర్థం చేసుకోవచ్చు. తాజాగా శనివారం కరీనా తన ముద్దుల కొడుకు తైమూర్‌తో దిగిన ఫోటోను షేర్‌ చేశారు. తైమూర్‌ను భుజాన వేసుకొని ఉన్న బ్లాక్‌ అండ్‌ వైట్‌ ఫోటోను షేర్‌ చేస్తూ..  ‘నా ఫ్రేమ్‌ను దొంగిలించడానికి ఎప్పటికైనా కేవలం ఈ ఒక్క వ్యక్తికే అనుమతిస్తాను’. అనే క్యాప్షన్‌ జత చేర్చారు.
(సైఫ్‌ అలీ ఖాన్‌ ఇంట్లో ఈ పెళ్లి ఇష్టం లేదు..)

చిన్న వయస్సులోనే తైమూర్‌కు విపరీతమైన ఫ్యాన్స్‌ ఫాలోయింగ్‌ ఉంది. తైమూర్‌ ఎక్కడ కనిపించినా కెమెరామెన్లు చుట్టూ చేరి అతన్ని క్లిక్‌మనిపిస్తుంటారు. ఇక ఈ ఫోటోపై అభిమానులతోపాటు బాలీవుడ్‌ తారలు స్పందిస్తున్నారు. కరణ్‌ జోహర్‌, మలైకా అరోరా, కరీష్మా కపూర్‌ తదితరులు హర్ట్‌ సింబల్‌ను జతచేరుస్తున్నారు. కాగా సినిమాల విషయానికొస్తే కరీనా తన నెక్స్ట్‌ ప్రాజెక్ట్‌ కరణ్‌ జోహార్‌ నిర్మిస్తున్న ‘తఖ్త్’ సినిమాలో కనిపించనున్నారు. అనిల్‌ కపూర్‌, రణ్‌వీర్‌ సింగ్‌, అలియా భట్‌, జాన్వీ కపూర్‌, విక్కీ కౌషల్‌, భూమి ఫడ్నేకర్‌ ముఖ్య పాత్రల్లో నటిస్తున్న ఈ సినిమాను వచ్చే ఏడాది డిసెంబర్‌ 24న విడుదల చేయాలని చిత్ర యూనిట్‌ ఆలోచిస్తుంది. (ఇంగ్లాండ్‌ బోర్డింగ్‌ స్కూల్‌కు తైమూర్‌!)

Advertisement
 
Advertisement
Advertisement