ఫస్ట్ ప్లేస్‌లో కరీనా | Kareena kapoor First Place in Fans Clubs | Sakshi
Sakshi News home page

ఫస్ట్ ప్లేస్‌లో కరీనా

May 14 2015 11:10 PM | Updated on Sep 3 2017 2:02 AM

ఫస్ట్ ప్లేస్‌లో కరీనా

ఫస్ట్ ప్లేస్‌లో కరీనా

మా హీరో గొప్ప, మా హీరోయిన్ కేక’’ ...ఇలా అనుకునే అభిమానులు చాలా మంది ఉంటారు. ఈ విషయంపై చాలామంది

 ‘‘మా హీరో గొప్ప, మా హీరోయిన్ కేక’’ ...ఇలా అనుకునే అభిమానులు చాలా మంది ఉంటారు. ఈ విషయంపై చాలామంది సామాజిక మాధ్యమాల్లో మాటల యుద్ధం కూడా సాగిస్తూ ఉంటారు. మరి కొంతమంది వీరాభిమానులు ‘ఫ్యాన్ క్లబ్స్’ ఏర్పాటు చేసి తమ అభిమానాన్ని చాటుకుంటూ ఉంటారు. సరిగ్గా ఇలాంటి అంశం మీద ఓ వెబ్‌సైట్ సర్వే నిర్వహించింది. ఏ బాలీవుడ్ తారకు ఆన్‌లైన్‌లో అత్యధికంగా అభిమాన సంఘాలున్నాయని వాకబు చేశారు. బాలీవుడ్ తార కరీనా కపూర్ ఖాన్ ఈ సర్వేలో మొదటి స్థానంలో నిలిచారు.
 
 ఇందులో విశేషం ఏమిటంటే కరీనాకు ఇప్పటివరకూ ట్విట్టర్‌లో కానీ, ఫేస్‌బుక్‌లో కానీ ఖాతాల్లేవు. మిగతా బాలీవుడ్ తారల్లాగా ఆమె తన అభిమానులతో టచ్‌లో కూడా ఉండరు. కానీ ఈ సర్వేలో ఆమెదే నంబర్‌వన్. దీనిపై ఆమె స్పందిస్తూ -‘‘నా జీవితంలో జరిగే సంఘటనలను సామాజిక మాధ్యమాల్లో అభిమానులతో పంచుకోవడం నాకు ఇష్టం ఉండదు. అందుకే నేను ఆన్‌లైన్‌లో అంత యాక్టివ్‌గా ఉండను. అయినా సరే నా మీద ఇంత ప్రేమ చూపిస్తున్న అభిమానులకు నా ధన్యవాదాలు. వాళ్ల ప్రేమకు వెలకట్టలేను’’ అని చెప్పారు.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement