breaking news
Fans Clubs
-
చేసింది 6 సినిమాలు.. పాక్‌లోనూ అభిమాన సంఘాలు
ఆమె ఓ సాధారణ యువ నటి. కన్ను గీటిన ఓ వీడియో వల్ల దేశవ్యాప్తంగా పాపులర్ అయిపోయింది. ఫస్ట్ మూవీ రిజల్ట్ సంగతి పక్కనబెడితే పలు భాషల్లో సినిమా ఛాన్సులు కొట్టేసింది. ఇప్పటివరకు ఆరు సినిమాలు చేస్తే వాటిలో ఏదీ కూడా హిట్ అవ్వలేదు. అయితేనేం పాకిస్థాన్ లో ఆమె ఫ్యాన్స్ అసోసియేషన్స్ పెట్టారట. అవును ఈ విషయాన్ని ఆ బ్యూటీనే స్వయంగా బయటపెట్టింది. ఒక్క వీడియో దెబ్బకు కేరళకు చెందిన ప్రియా ప్రకాశ్ వారియర్.. డిగ్రీ చదువుతున్నప్పుడే 'ఒరు అదార్ లవ్' (లవర్స్ డే) అనే మలయాళ సినిమాలో అవకాశం దక్కించుకుంది. ఈమె స్టైల్‌గా కన్ను కొడుతున్న వీడియో బిట్ అప్పట్లో రిలీజ్ చేస్తే, ఊహించనంత పాపులారిటీ వచ్చేసింది. ఆ సినిమా పెద్దగా ఆకట్టుకోనప్పటికీ తెలుగుతోపాటు ఇతర భాషల చిత్రాల్లోనూ ఛాన్సులొచ్చాయి. (ఇదీ చదవండి: ఆ న్యూస్ చూసి చాలా బాధపడ్డాను: సుస్మిత కొణిదెల) తెలుగులో రెండే జస్ట్ ఒక్క వీడియోతో క్రేజ్ తెచ్చుకున్న ప్రియా వారియర్.. తెలుగులో నితిన్ 'చెక్', తేజా సజ్జా 'ఇష్క్' సినిమాల్లో నటించింది. కానీ ఈ రెండూ బాక్సాఫీస్ దగ్గర బోల్తా కొట్టాయి. ఈమె నటించిన గత మూడు చిత్రాలు మలయాళంవే. అవి కూడా ఏమంత చెప్పుకోద్దగ స్థాయిలో ప్రేక్షకుల్ని అలరించలేదు. ప్రస్తుతం ఈమె 'బ్రో' మూవీపైనే ఆశలు పెట్టుకుంది. పాక్‌లో ఫ్యాన్స్ బాలీవుడ్ పలువురు పాక్ సింగర్స్, నటులు ఉంటారు కానీ మన యాక్టర్స్ కి దాయాది దేశంలో పెద్దగా అభిమానులు ఉండరు. అలాంటిది ప్రియా వారియర్ కన్ను గీటిన వీడియోకు పాక్ కుర్రాళ్లు పడిపోయారు. దీని గురించి స్వయంగా ఈ బ్యూటీనే చెప్పింది. దేనికి కనెక్ట్ కానీ పాక్ ప్రేక్షకులకు తన వీడియో తెగ నచ్చేసిందని, రోజూ మెసేజులు పెట్టేవారని, బాగా చేశావని మెచ్చుకున్నారని చెప్పింది. మీ కోసం ఇక్కడ అభిమాన సంఘాలు ఉన్నాయని వాళ్లు చెబుతుంటే నమ్మలేకపోయేదాన్నని ప్రియా వారియర్ పేర్కొంది. (ఇదీ చదవండి: 'బేబీ' హీరోయిన్ ఫస్ట్ రెమ్యునరేషన్ ఎంతో తెలుసా?) -
అభిమాని పెళ్లికి హాజరైన సూర్య..
-
ఫస్ట్ ప్లేస్‌లో కరీనా
‘‘మా హీరో గొప్ప, మా హీరోయిన్ కేక’’ ...ఇలా అనుకునే అభిమానులు చాలా మంది ఉంటారు. ఈ విషయంపై చాలామంది సామాజిక మాధ్యమాల్లో మాటల యుద్ధం కూడా సాగిస్తూ ఉంటారు. మరి కొంతమంది వీరాభిమానులు ‘ఫ్యాన్ క్లబ్స్’ ఏర్పాటు చేసి తమ అభిమానాన్ని చాటుకుంటూ ఉంటారు. సరిగ్గా ఇలాంటి అంశం మీద ఓ వెబ్సైట్ సర్వే నిర్వహించింది. ఏ బాలీవుడ్ తారకు ఆన్లైన్లో అత్యధికంగా అభిమాన సంఘాలున్నాయని వాకబు చేశారు. బాలీవుడ్ తార కరీనా కపూర్ ఖాన్ ఈ సర్వేలో మొదటి స్థానంలో నిలిచారు. ఇందులో విశేషం ఏమిటంటే కరీనాకు ఇప్పటివరకూ ట్విట్టర్లో కానీ, ఫేస్బుక్లో కానీ ఖాతాల్లేవు. మిగతా బాలీవుడ్ తారల్లాగా ఆమె తన అభిమానులతో టచ్‌లో కూడా ఉండరు. కానీ ఈ సర్వేలో ఆమెదే నంబర్‌వన్. దీనిపై ఆమె స్పందిస్తూ -‘‘నా జీవితంలో జరిగే సంఘటనలను సామాజిక మాధ్యమాల్లో అభిమానులతో పంచుకోవడం నాకు ఇష్టం ఉండదు. అందుకే నేను ఆన్లైన్లో అంత యాక్టివ్‌గా ఉండను. అయినా సరే నా మీద ఇంత ప్రేమ చూపిస్తున్న అభిమానులకు నా ధన్యవాదాలు. వాళ్ల ప్రేమకు వెలకట్టలేను’’ అని చెప్పారు.