భలే భజరంగీ | Kannada Star Rajkumar Bajarangi 2 teaser is out | Sakshi
Sakshi News home page

భలే భజరంగీ

Jul 13 2020 1:41 AM | Updated on Jul 13 2020 1:41 AM

Kannada Star Rajkumar Bajarangi 2 teaser is out - Sakshi

శివరాజ్‌ కుమార్‌

కన్నడ స్టార్‌ హీరో శివరాజ్‌ కుమార్‌ నటించిన తాజా చిత్రం ‘భజరంగీ 2’. హర్ష దర్శకత్వంలో తెరకెక్కిన ఈ చిత్రంలో భావన కథానాయికగా నటించారు. జయన్న ఫిలిమ్స్‌ బ్యానర్‌పై జయన్న, భోగేంద్ర నిర్మించారు. శివరాజ్‌ కుమార్‌ పుట్టినరోజు (జూలై 12) సందర్భంగా ఆదివారం ‘భజరంగీ–2’ టీజర్‌ విడుదల చేశారు. 2013లో ఘనవిజయం సాధించిన ‘భజరంగీ’ చిత్రానికి సీక్వెల్‌గా ‘భజరంగీ–2’ తెరకెక్కింది.

భారీ బడ్జెట్‌తో తెరకెక్కిన ఈ మూవీ టీజర్‌కు అద్భుతమైన స్పందన వస్తోందని చిత్రబృందం పేర్కొంది. ఈ స్పందన చూసి ఈ సినిమాను ప్యాన్‌ ఇండియా లెవెల్‌లో రిలీజ్‌ చేసే ఆలోచనలో ఉన్నారట దర్శక–నిర్మాతలు. టీజర్‌కు వచ్చిన స్పందన గురుంచి శివరాజ్‌ కుమార్‌ మాట్లాడుతూ– ‘‘మా సినిమా టీజర్‌కు ఇంత స్పందన వస్తుందని అనుకోలేదు. అన్ని ఇండస్ట్రీల నుంచి ఫోన్‌ చేస్తున్నారు. ఈ అద్భుతమైన స్పందనకి అందరికీ ధన్యవాదాలు’’ అన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement