మరోసారి గాయపడిన స్టార్ హీరోయిన్

Kangna Ranaut sustains leg injury on sets of Manikarnika - Sakshi - Sakshi - Sakshi

బాలీవుడ్‌ వివాదాస్పద నటి కంగనా రనౌత్‌ మరోసారి షూటింగ్ లో గాయపడ్డారు. ప్రస్తుతం నిర్మాణంలో ఉన్న 'మణికర్ణిక-ద క్వీన్‌ ఆఫ్‌ ఝాన్సీ' షూటింగ్‌ సందర్భంగా ఆమె కాలికి గాయమైంది. వెంటనే స్పందించిన చిత్రయూనిట్ ఆమెను దగ్గర్లోని ప్రైవేట్ హాస్పిటల్ కు తీసుకెళ్లారు. ప్రమాదమేమి లేకపోయినా కొద్ది రోజులు విశ్రాంతి తీసుకోవాలని డాక్టర్లు సూచించటంతో షూటింగ్ కు బ్రేక్ ఇచ్చిన కంగనా ముంబై వెళ్లిపోయారు. గతంలోనూ ఓ పోరాట సన్నివేశం షూటింగ్ లో గాయపడిన కంగనా కొద్ది రోజులు పాటు షూటింగ్ కు దూరమయ్యారు. టాలీవుడ్ దర్శకుడు క్రిష్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ సినిమాకు లెజెండరీ రైటర్ విజయేంద్ర ప్రసాద్ కథ అందిస్తున్నారు.
 

Advertisement
Advertisement

*మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది, *అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం, *ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరించబడతాయి, *వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి

Back to Top